23 ఏళ్ళ `సీతారామరాజు`!
on Feb 5, 2022

తెలుగునాట అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో `సీతారామరాజు` ఒకటి. ఇందులో అన్న సీతయ్యగా నందమూరి హరికృష్ణ నటించగా, తమ్ముడు రామరాజుగా కింగ్ నాగార్జున అభినయించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ.. సినిమాకి ఎస్సెట్ గా నిలిచింది. వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగ్ కి జోడీగా సాక్షి శివానంద్, సంఘవి అలరించగా, హరికృష్ణకి జంటగా కల్పన కనిపించారు. రవితేజ, బ్రహ్మాజీ, శివాజీ, చంద్రమోహన్, నిర్మలమ్మ, కోట శ్రీనివాసరావు, సత్య ప్రకాశ్, మాన్య, బెనర్జీ, ఆహుతి ప్రసాద్, ప్రసాద్ బాబు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
స్వరవాణి కీరవాణి బాణీలకు దిగ్గజ గీతరచయిత `సిరివెన్నెల` సీతారామశాస్త్రి సాహిత్యమందించారు. ``చాంగురే చాంగురే``, ``శ్రీవారు దొరవారు``, ``ఎక్స్టసీ ప్రైవసీ``, ``హోలీ``, ``కుందనపు బొమ్మకి``, ``వినుడు వినుడు``, ``ఉయ్యాలా ఉయ్యాలా``.. ఇలా ఇందులోని గీతాలన్ని ఆకట్టుకున్నాయి. ``వినుడు వినుడు`` గీతాన్ని నాగ్ స్వయంగా ఆలపించడం విశేషం. గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్, కామాక్షి మూవీస్ పతాకాలపై అక్కినేని నాగార్జున, డి. శివప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన `సీతారామరాజు``.. `బెస్ట్ క్యారెక్టర్ యాక్ట్రస్` (నిర్మలమ్మ), `బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్` (రామచంద్ర రావు) విభాగాల్లో `నంది` పురస్కారాలను అందుకుంది. 1999 ఫిబ్రవరి 5న విడుదలై జననీరాజనాలు అందుకున్న `సీతారామరాజు`.. నేటితో 23 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



