`దూత`గా చైతూ!?
on Feb 5, 2022

వరుస విజయాలతో ముందుకు సాగుతున్న యువ కథానాయకుల్లో అక్కినేని నాగచైతన్య ఒకరు. త్వరలో ఈ టాలెంటెడ్ హీరో.. `థాంక్ యూ` చిత్రంతో సందడి చేయనున్నాడు. ఇక ఆ సినిమా కంటే ముందే బాలీవుడ్ మూవీ `లాల్ సింగ్ చద్ధా`లో ఓ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనున్నాడు చైతూ.
Also Read: తారక్ చిత్రానికి రెహమాన్ స్వరాలు!?
ఇదిలా ఉంటే.. `మనం`, `థాంక్ యూ` తరువాత వెర్సటైల్ కెప్టెన్ విక్రమ్ కె. కుమార్ తో చైతూ మరోమారు జట్టుకడుతున్న సంగతి తెలిసిందే. హారర్ - థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కనున్న వెబ్ సిరీస్ ఇది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఈ సిరీస్.. మూడు సీజన్లగా ఎంటర్టైన్ చేయనుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ వెబ్ - సిరీస్ కి `దూత` అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్లు వేచిచూడాల్సిందే.
Also Read: హృతిక్ తో డేటింగ్.. మాస్క్ పెట్టుకున్న ఆ బ్యూటీని గుర్తుపట్టారా?
కాగా, ఈ వెబ్ - సిరీస్ లో చైతూ ఓ జర్నలిస్ట్ గా కనిపించబోతున్నాడు. అంతేకాదు.. తన పాత్ర కాస్త నెగటివ్ షేడ్స్ తో సాగుతుందని సమాచారం. మరి.. నాగచైతన్య డెబ్యూ సిరీస్ తనకి నటుడిగా ఎలాంటి గుర్తింపును అందిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



