పెద్దాయన సతీమణి కాళ్ళు కూడా మొక్కిన సంస్కారం పవన్ కళ్యాణ్ ది
on Apr 26, 2017
కే విశ్వనాధ్ కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం ఆయనకు ఒక్కడికే కాదు మొత్తం తెలుగు వాళ్ళకి గర్వించదగ్గ విషయం. నిన్న మెగాస్టార్ చిరంజీవి పెద్దాయన ఇంటికి స్వయంగా వెళ్లి అభినందించడం జరిగింది. తాను వెళ్ళినప్పుడు గురువుగారు ఫోన్లో సంభాషిస్తూ ఉండడంతో, ఫోన్ పెట్టేసేంత వరకు అలాగే నిలబడి తన గురు భక్తి ఏంటో నిరూపించుకున్నాడు చిరు. ఈ రోజు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి కే విశ్వనాధ్ గారిని అభినందించడానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ పెద్ద వాళ్ళని అభిమానించడంలో అన్నని మించిన తమ్ముడు అనిపించుకున్నాడు. అక్కడికి సెలబ్రిటీలా కాకుండా ఒక అభిమానిగా వెళ్లిన పవన్ కళ్యాణ్ వినయంగా పెద్దాయనకి పాదాభివందనం చేసారు. తరువాత శాలువా కప్పి సత్కరించారు. అంతేనా, తరువాత వచ్చిన విశ్వనాధ్ గారి సతీమణి కాళ్ళకి కూడా నమస్కరించారు పవన్ కళ్యాణ్. పెద్ద వాళ్లంటే పవర్ స్టార్ కి ఎంత అభిమానమో ఈ సంఘటనే గొప్ప ఉదాహరణ. తర్వాత మీడియా తో మాట్లాడుతూ తనకి కే విశ్వనాధ్ గారి గురించి మాట్లాడే స్థాయి లేదని చెప్పి పెద్దాయన మీద ఎంత గౌరవం ఉందో చెప్పకనే చెప్పారు. కే విశ్వనాధ్ దర్శకత్వం వహించిన 12 గొప్ప సినిమాల డిస్క్ చేయడం అన్నింటి కన్నా గొప్ప బహుమానం. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా సమయం వెచ్చించిన పవన్ నిజంగా అభినందనీయుడే మీరేమంటారు!

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
