జనవరి 13.. నందమూరి మూడు తరాలకు అచ్చొచ్చిన తేది!
on Jan 13, 2022

నందమూరి కుటుంబానికి, సంక్రాంతి పర్వదినానికి మంచి అనుబంధం ఉంది. ఈ సీజన్ లో నందమూరి కథానాయకులు నటరత్న నందమూరి తారక రామారావు, నటసింహా బాలకృష్ణ పలు చిరస్మరణీయ విజయాలు అందుకున్నారు. అంతేకాదు.. ఈ కుటుంబానికి చెందిన మూడు తరాల అగ్ర కథానాయకులు కూడా ఈ సీజన్ లో హిట్స్ చూశారు. మరీముఖ్యంగా.. జనవరి 13 నందమూరి ఫ్యామిలీ స్టార్స్ కి ఎంతో ప్రత్యేకం. ఈ తేదీన ఎన్టీఆర్, బాలయ్య, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ఇలా మూడు వేర్వేరు తరాలకు చెందిన నందమూరి కథానాయకులు బ్లాక్ బస్టర్స్ చూశారు.
Also Read: 'మోహన్ బాబు యూనివర్సిటీ'గా మారిన 'శ్రీ విద్యానికేతన్'!
ఆ వివరాల్లోకి వెళితే.. 1966 జనవరి 13న ఎన్టీఆర్ నటించిన `శ్రీక్రిష్ణ పాండవీయం` విడుదలై ఘనవిజయం సాధించగా.. అదే జనవరి 13న 1999లో జనం ముందు నిలిచిన బాలయ్య `సమరసింహారెడ్డి` పాత రికార్డులను భూస్థాపితం చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక అదే జనవరి 13న తారక్ ద్విపాత్రాభినయంలో తెరకెక్కిన `అదుర్స్` (2010) రిలీజై విజయం సాధించింది. అంతేకాదు.. అదే తేదికి 2016లో `నాన్నకు ప్రేమతో` కూడా విడుదలై చెప్పుకోదగ్గ సక్సెస్ చూసింది. మొత్తంగా.. జనవరి 13 ఎన్టీఆర్, బాలయ్య, తారక్.. ఇలా నందమూరి మూడు తరాల కథానాయకులకు మరపురాని విజయాలను అందించి ప్రత్యేకంగా నిలిచింది. మరి.. నాలుగో తరానికి కూడా ఇదే తేది భవిష్యత్ లో కలిసొస్తుందేమో చూడాలి.
Also Read: సినిమా ఇండస్ట్రీ కష్టాలను ఏపీలో వినిపించుకొనే నాథుడేడీ?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



