Home

»

Latest News

సినిమా ఇండ‌స్ట్రీ క‌ష్టాల‌ను ఏపీలో వినిపించుకొనే నాథుడేడీ?

Jan 12, 2022

 

దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ ధ‌ర‌ల వ్య‌వ‌హారం ర‌చ్చ‌ర‌చ్చ‌గా మారింది. అక్క‌డ ఇదివ‌ర‌కు ఉన్న టికెట్ రేట్ల‌ను త‌గ్గిస్తూ జీవో తీసుకురావ‌డంతో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ క‌ష్టాల‌ను ఎదుర్కొంటోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతూ వ‌స్తోంది. ఈ టైమ్‌లోనే బాల‌కృష్ణ హీరోగా న‌టించిన అఖండ మూవీ డిసెంబ‌ర్ 2న విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. అయితే ఏపీలో టికెట్ ధ‌ర‌లు త‌క్కువ‌వ‌డం వ‌ల్ల అక్క‌డ ఆశించిన రీతిలో క‌లెక్ష‌న్లు రాలేద‌న్న‌ది విశ్లేష‌కులు చెప్తున్న మాట‌. 

Also read: అల్లు అర‌విందే కాదు, 'అన్‌స్టాప‌బుల్‌' ప్ర‌పోజ‌ల్‌తో ఎవ‌రొచ్చినా నేను చేసుండేవాడ్ని!

"ఏపీలో సినిమా టికెట్ ధ‌ర‌ల అంశంలో ఇండ‌స్ట్రీ పెద్ద‌గా, అగ్ర‌న‌టునిగా, నిర్మాత‌గా చొర‌వ తీసుకోవ‌చ్చు క‌దా?" అనే ప్ర‌శ్న బాల‌కృష్ణ‌కు మీడియా నుంచి ఎదురైంది. బుధ‌వారం అఖండ సంక్రాంతి సంబ‌రాలు హైద‌రాబాద్‌లో జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ఏర్పాటుచేసిన మీడియా ఇంట‌రాక్ష‌న్‌లో వ‌చ్చిన ప్ర‌శ్న‌కు, "తీసుకోవ‌చ్చు. కానీ ఇది ఒక్క‌డి నిర్ణ‌యం కాదు. అంద‌రూ క‌లిసి చ‌ర్చ‌లు పెట్టి, అందులో వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్ల‌వ‌చ్చు. అయితే ఇక్క‌డ ప్ర‌జ‌ల‌లో రెండు ర‌కాల వాద‌న‌లున్నాయి. అది టికెట్ల రేట్ల‌మీదే.. త‌గ్గించ‌డ‌మా, పెంచ‌డ‌మా అనేది. ఈ క‌రోనా ప‌రిస్థితుల్లో అంద‌రూ క‌లిసి చ‌ర్చించుకోవాల్సిన విష‌యం. నా ఒక్క‌డి అభిప్రాయం కాద‌ది. దానిపై నేనేమీ అనుకోలేదు. నా అభిప్రాయం ఒక‌టే.. అంద‌రూ క‌లిసి.. చాంబ‌ర్ కానివ్వండి, ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ కానివ్వండి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ కానివ్వండి.. చ‌ర్చించుకోవాలి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఇండ‌స్ట్రీ ఏ నిర్ణ‌యం తీసుకుంటుందో దానికి మేమంతా క‌లిసిక‌ట్టుగా మా అభిప్రాయాన్ని ప్ర‌భుత్వం ముందు పెడ‌తాం." అని ఆయ‌న జ‌వాబిచ్చారు.

Also read: 37 ఏళ్ల త‌ర్వాత కూడా బాల‌య్య ఎన‌ర్జీ వెనకున్న ర‌హ‌స్యమిదే!

"ఇండ‌స్ట్రీ నుంచి అలాంటి రిప్ర‌జెంటేష‌న్ లేనందువ‌ల్లే ఇలాంటి ప‌రిస్థితులొచ్చాయ‌ని అనుకోవ‌చ్చా?" అనే ప్ర‌శ్న‌కు, "ముందక్క‌డ వినిపించుకునే నాథుడు ఉండాలి క‌దాండీ. ప్ర‌భుత్వానికి ఇది కూడా ఒక పెద్ద ఆదాయం. బ‌హుశా నేన‌నుకోవ‌డం వాళ్ల‌కు చిన్న అనుమానం ఉండొచ్చు.. ప్ర‌జ‌లు థియేట‌ర్ల‌కు వ‌స్తారో, రారో అని. వ‌స్తార‌ని 'అఖండ' నిరూపించింది కాబ‌ట్టి, ఇప్పుడు మేమిచ్చే స‌ల‌హాల‌ను వాళ్లు త‌ప్పకుండా తీసుకుంటార‌నుకుంటాను." అని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

"దేశంలో ఎక్క‌డా లేదు, ఏపీలోనే ఈ ప‌రిస్థితి ఎందుకు త‌లెత్తిందంటారు?" అని ప్ర‌శ్నిస్తే, "అంటే.." అని జ‌వాబివ్వ‌కుండా అంత‌టితో ఆగిపోయారు బాల‌య్య‌.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com