Home

»

Latest News

'మోహన్ బాబు యూనివర్సిటీ'గా మారిన 'శ్రీ విద్యానికేతన్‌'!

Jan 13, 2022

ప్రముఖ నటుడు మోహన్ బాబు ఎన్నో ఏళ్లుగా శ్రీ విద్యానికేతన్‌ పేరుతో విద్యాసంస్థలను నడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలకు యూనివర్సిటీ హోదా వచ్చింది. ఈ విషయాన్ని తాజాగా మోహన్ బాబు అధికారికంగా ప్రకటించారు.

“శ్రీ విద్యానికేతన్‌లో వేసిన విత్తనాలు ఇప్పుడు కల్పవృక్షంగా మారాయి. మీ 30 సంవత్సరాల నమ్మకంతో నా జీవిత లక్ష్యం ఇప్పుడు నెరవేరింది. తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీని తీసుకొస్తున్నాను. మీ ప్రేమే నా బలం, మీ మద్దతు ఎప్పుడూ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను” అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.

శ్రీ విద్యానికేతన్ ను 1992లో ప్రారంభించారు. ఈ సంస్థలో ప్రస్తుతం శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషన్ స్కూల్, డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఫార్మసీ, పీజీ కాలేజ్ సముదాయం ఉంది. తన విద్యాసంస్థకు యూనివర్సిటీ హోదా కోసం ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న మోహన్ బాబు కల ఇన్నాళ్లకు నెరవేరింది. శ్రీ విద్యానికేతన్ ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీగా మారడంతో ఆయన సంతోషంలో మునిగిపోయారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com