ఏప్రిల్ నుంచి రామ్, బోయపాటి చిత్రం!?
on Feb 7, 2022

`అఖండ`తో సెన్సేషనల్ హిట్ అందుకున్న మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను.. తన తదుపరి చిత్రాన్ని ఏ హీరోతో చేయబోతున్నారా? అని టాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో బోయపాటి నెక్స్ట్ వెంచర్ ఉండనుందట. అంతేకాదు.. ఈ సినిమా కోసం రామ్ రూ. 9 కోట్ల పారితోషికం అందుకోనుండగా, బోయపాటి రూ. 12 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని గత రెండు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది కూడా. కాగా, ఈ సినిమాని సమంతతో `యూటర్న్`, గోపీచంద్ తో `సీటీమార్` చిత్రాలని నిర్మించిన శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ సంస్థ అధినేత శ్రీనివాస చిట్టూరి నిర్మించబోతున్నారట.
Also Read: `దూత`గా చైతూ!?
ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న రామ్ బైలింగ్వల్ మూవీ `ద వారియర్`కి కూడా శ్రీనివాస చిట్టూరినే నిర్మాత కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రానున్న సినిమా ఏప్రిల్ లో పూజా కార్యక్రమాలతో సెట్స్ పైకి వెళుతుందట. ద్వితీయార్ధంలో రెగ్యులర్ షూటింగ్ బాట పడుతుందని అంటున్నారు. ఆపై చకచకా చిత్రీకరణ పూర్తిచేసి 2023 ఆరంభంలో సినిమాని రిలీజ్ చేస్తారని సమాచారం. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



