`హలో బ్రదర్` హిందీ రీమేక్ `జుడ్వా`కి పాతికేళ్ళు!
on Feb 7, 2022

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కెరీర్ లో పలు రీమేక్ సెన్సేషన్స్ ఉన్నాయి. మరీముఖ్యంగా.. తెలుగునాట ఘనవిజయం సాధించిన సినిమాల తాలూకు రీమేక్స్ తో హిందీనాట సంచలనం సృష్టించారు సల్మాన్. అలాంటి బ్లాక్ బస్టర్స్ లో `జుడ్వా` ఒకటి. 1994లో అఖండ విజయం సాధించిన కింగ్ నాగార్జున ద్విపాత్రాభినయ చిత్రం `హలో బ్రదర్`కి హిందీ వెర్షన్ ఇది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కవల సోదరులు రాజా, ప్రేమ్ మల్హోత్రాగా సల్మాన్ ఆకట్టుకున్నారు. తెలుగులో రమ్యకృష్ణ పోషించిన పాత్రలో కరిష్మా కపూర్ కనువిందు చేయగా.. సౌందర్య అభినయించిన పాత్రలో రంభ ఆకట్టుకున్నారు.
Also Read: నెటిజన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సింగర్ సునీత
శక్తి కపూర్, కదేర్ ఖాన్, రీమా లాగూ, బిందు, అనుపమ్ ఖేర్, సతీష్ షా, ముకేశ్ రిషి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చిన ఈ చిత్రానికి అనూ మాలిక్ బాణీలు అందించగా, కోటి నేపథ్య సంగీతమందించారు. ఇందులోని పాటలన్నీ కూడా సంగీత ప్రియులను అలరించాయి. ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన `జుడ్వా 2` (2017) కూడా రంజింపజేయడం విశేషం. సాజిద్ నడియాడ్ వాలా నిర్మించిన `జుడ్వా`.. 1997 ఫిబ్రవరి 7న విడుదలై జననీరాజనాలు అందుకుంది. నేటితో ఈ యాక్షన్ కామెడీ డ్రామా పాతికేళ్ళు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



