పవన్ మల్టిస్టారర్స్ః ఫస్ట్ సాయితేజ్.. నెక్స్ట్ వైష్ణవ్ తేజ్!?
on Feb 7, 2022

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలతో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా త్వరలో హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటితో కలిసి `భీమ్లా నాయక్`గా ఎంటర్టైన్ చేయనున్నారాయన. ఆపై పిరియడ్ డ్రామా `హరిహర వీరమల్లు`తోనూ, సోషల్ డ్రామా `భవదీయుడు భగత్ సింగ్`తోనూ పలకరించబోతున్నారు. అలాగే స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డితోనూ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు.
Also Read: తారక్ తో పరశురామ్?
ఇదిలా ఉంటే.. తమిళ చిత్రం `వినోదయ సిత్తమ్` ఆధారంగా రూపొందనున్న తెలుగు రీమేక్ లోనూ పవన్ నటించబోతున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మాతృక దర్శకుడు సముద్రఖని రూపొందించనున్న ఈ సినిమాలో తన మేనల్లుడు, `సుప్రీమ్` హీరో సాయితేజ్ తో కలిసి నటించబోతున్నారట పవన్. అంతేకాదు.. ఈ మల్టిస్టారర్ తరువాత మరో మేనల్లుడు, సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తోనూ ఇంకో మల్టిస్టారర్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఈ కొణిదెల స్టార్. అయితే, వైష్ణవ్ తో కలిసి నటించబోయే సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. మరి.. మేనల్లుళ్ళతో పవన్ చేయనున్న ఈ మల్టిస్టారర్స్ ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



