Home

»

Latest News

ప్రశాంత్‌ వర్మకు బిగ్ షాక్: మరో ‘హనుమాన్‌ 2’ ప్రకటించిన ప్రొడ్యూసర్స్.. హీరో ఎవరంటే.?

Nov 21, 2026 10:49AM

‘హనుమాన్‌’ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న తర్వాత ఆ ఫ్రాంచైజీ నుంచి మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇప్పుడు డబుల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చింది. ఒకవైపు రిషబ్‌ శెట్టి ప్రధాన పాత్రలో ప్రశాంత్‌ వర్మ ‘జై హనుమాన్‌’ తెరకెక్కిస్తుండగా.. మరోవైపు పంజా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా ‘హనుమాన్‌ 2’ను ప్రకటించారు. దీంతో ఒకే ఫ్రాంచైజీ పేరుతో రెండు వేర్వేరు సినిమాలు తెరపైకి రావడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

తాజాగా నిర్మాత నిరంజన్‌ రెడ్డి తన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ‘హనుమాన్‌ 2’ను ప్రకటించారు. పంజా వైష్ణవ్‌ తేజ్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ‘ది రైజ్‌ ఆఫ్‌ వానరాస్‌’ అనే ట్యాగ్‌లైన్‌ పెట్టారు. 

విఐ ఆనంద్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విడుదల చేసిన పోస్టర్‌లో ఆధ్యాత్మికత, ఫాంటసీ అంశాలతో కూడిన భారీ ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం కనిపిస్తోంది.

మరోవైపు ‘హనుమాన్‌’ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఇప్పటికే ‘జై హనుమాన్‌’ సినిమాను పట్టాలెక్కించారు. ఇందులో రిషబ్‌ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ కూడా ఇటీవల ప్రారంభమైనట్లు వార్తలు వచ్చాయి.

ఇది కూడా చదవండి: 450 కోట్ల సినిమా.. ఎవరూ పట్టించుకోలేదు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.!

అయితే ‘హనుమాన్‌’ తర్వాత సీక్వెల్‌ విషయంలో నిర్మాత నిరంజన్‌ రెడ్డి, దర్శకుడు ప్రశాంత్‌ వర్మ మధ్య క్రియేటివ్‌ విభేదాలు తలెత్తినట్లు గతంలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇద్దరూ వేర్వేరు హీరోలతో హనుమాన్‌ నేపథ్యంలోని సినిమాలను ముందుకు తీసుకెళ్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మొత్తానికి ఒకప్పుడు ‘హనుమాన్‌’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫ్రాంచైజీ నుంచి ఇప్పుడు రెండు సినిమాలు రాబోతున్నాయి. ఒకదానిలో వైష్ణవ్‌ తేజ్‌, మరొకదానిలో రిషబ్‌ శెట్టి కనిపించనున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ప్రేక్షకులకు ఎక్కువగా నచ్చుతుంది? రెండు చిత్రాలు ఒకదానికొకటి భిన్నమైన కథలతో ఎలా మెప్పిస్తాయి? అన్నది ఆసక్తికరంగా మారింది.

మీకు నచ్చవచ్చు: 
త్రివిక్రమ్‌ నెక్స్ట్‌ మూవీ.. చిరంజీవితోనా.. సూర్యతోనా.?
బాలకృష్ణకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం.!

 

 

 

[HanuMan 2, Jai Hanuman, Prasanth Varma, Niranjan Reddy, Panja Vaisshnav Tej]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com