Home

»

Latest News

బాలకృష్ణకు విశిష్ట పురస్కారం: తెలంగాణ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం.!

Nov 20, 2026 3:13PM

నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గుర్తింపు దక్కనుంది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అందించే విశిష్ట పురస్కారానికి ఈ ఏడాది బాలకృష్ణను ఎంపిక చేసినట్లు సమాచారం. ఆయన సినీ సేవలతో పాటు సామాజిక సేవను గుర్తించి ఈ పురస్కారానికి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

తెలుగు సినిమా రంగంలో దశాబ్దాలుగా నటుడిగా కొనసాగుతున్న బాలకృష్ణ.. ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. మరోవైపు బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌గా కూడా సేవలందిస్తున్నారు. క్యాన్సర్‌ బాధితులకు వైద్య సేవలు అందించే విషయంలో ఆయన చేస్తున్న కృషిని కూడా ఈ ఎంపికలో పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం.

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రతి ఏడాది కళలు, సాహిత్యం, సామాజిక సేవ, సాంస్కృతిక, వైజ్ఞానిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి విశిష్ట పురస్కారాన్ని అందిస్తుంది. 

ఈసారి కళ, సేవా రంగాల నుంచి బాలకృష్ణ పేరును ప్రతిపాదించగా, తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: బాలకృష్ణ దాదా లేటెస్ట్ అప్డేట్.. సినిమాలో అదిరిపోయే ట్విస్ట్.!

అయితే ఈ పురస్కారానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఇప్పటికే నటుడిగా, ఎమ్మెల్యేగా, క్యాన్సర్‌ ఆస్పత్రి సేవలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణకు ఈ పురస్కారం లభిస్తే ఆయన ఖాతాలో మరో గౌరవం చేరినట్లే.

మీకు కూడా నచ్చవచ్చు: 
ఒసేయ్ రాములమ్మ రీమిక్స్‌.. థియేటర్లను షేక్ చేయబోతున్న రష్మిక.!
తాత టైటిల్‌తో తారక్ మూవీ.. అనిల్‌ రావిపూడి ప్లాన్ మామూలుగా లేదు.!

 

 

 

[Nandamuri Balakrishna, Telugu University Award 2026, Visishta Puraskaram, Telangana Government]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com