Home

»

Latest News

ఆ నలుగురు తెలుగు హీరోలు అడిగితే వాళ్ళ సినిమాల్లో ఆ..క్యారక్టర్ చేస్తా: సల్మాన్ సంచలన ప్రకటన!

Nov 21, 2026 10:54AM

 


ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద సల్మాన్ ఖాన్ అనే కట్ అవుట్ కి ఉన్న కెపాసిటీ తెలిసిందే. తెలుగు నాట కూడా సల్మాన్ సినిమా వస్తుంటే అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. అందుకే నిన్న తన అప్ కమింగ్ మూవీ మాతృభూమి ప్రమోషన్స్ ని హైదరాబాద్ లో నిర్వహించాడు. 


ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ హీరోల గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి.   తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకున్న స్నేహబంధం గురించి సల్మాన్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తనకు అత్యంత సన్నిహితులని పేర్కొన్నాడు.

ఈ నలుగురు స్టార్ హీరోలలో ఎవరు అడిగినా సరే, వారి సినిమాల్లో క్యామియో రోల్స్( జస్ట్ గెస్ట్) చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని సల్మాన్ ఖాన్ చెప్పాడు. కేవలం స్నేహం కోసమే వారి చిత్రాల్లో భాగం కావడానికి తాను ఎప్పుడూ వెనుకాడనని స్పష్టం చేయడం సినీ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 

 గతంలో మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన 'గాడ్ ఫాదర్' లో సల్మాన్ పవర్‌ఫుల్ క్యారక్టర్ లో కనపడి అభిమానులకి, స్క్రీన్ కి మెగా సంతోషాన్ని తీసుకొచ్చాడు. ఆ ఇద్దరి మధ్య వచ్చిన  యాక్షన్ సన్నివేశాలు థియేటర్లలో పూనకాలు తెప్పించాయి. అలాగే సల్మాన్ నటించిన 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' చిత్రంలో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషించగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక ప్రత్యేక పాటలో అతిథిగా మెరిసి  అలరించాడు. 

ఇది కూడా చదవండి: ఓం ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్: ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్!

ఇప్పటికే చిరంజీవి, వెంకటేశ్, రామ్ చరణ్‌లతో తెరను పంచుకున్న సల్మాన్ ఖాన్, ఇప్పుడు  ఎన్టీఆర్‌తో పాటు మిగిలిన హీరోల సినిమాల్లోనూ మళ్లీ కనిపించేందుకు సిద్ధమని ప్రకటించడం విశేషం. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కూడా ఒక భారీ చిత్రంలో నటిస్తున్నారు. వంశీ ఒక అద్భుతమైన దర్శకుడని, ఆ సినిమా చాలా బాగా వస్తోందని సల్మాన్ ప్రశంసించారు.

ఇక  'మాతృభూమి' గురించి మాట్లాడుతూ, ఇప్పటివరకు పాకిస్థాన్‌తో పోరాడే నేపథ్యమున్న సినిమాలు చేశానని, కానీ మొదటిసారి చైనా సరిహద్దు నేపథ్యంలో సాగే కథలో నటించడం కొత్త అనుభూతినిచ్చిందని తెలిపారు. గడ్డకట్టే చలిలో షూటింగ్ చేయడం శారీరకంగా ఎంతో సవాలుగా నిలిచిందని, ఈ సందర్భంగా అమరవీరుడు కల్నల్ సంతోష్ బాబు వీరమరణాన్ని ఆయన స్మరించుకుంటూ నివాళులర్పించారు.

ఏదేమైనా బాలీవుడ్, టాలీవుడ్ మధ్య సరిహద్దులు చెరిగిపోతున్న ఈ తరుణంలో, సల్మాన్ ఖాన్ చేసిన ఈ ప్రకటన భవిష్యత్తులో మరిన్ని క్రేజీ మల్టీస్టారర్ కాంబినేషన్లకు బాటలు వేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మాతృభూమికి  అపూర్వ లిఖియా దర్శకుడు కాగా చిత్రాంగద సింగ్ హీరోయిన్‌. డిసెంబర్ 4 రిలీజ్ డేట్ .

 

[Salman Khan, chiranjeevi, ntr, ramcharan, venkatesh, apoorva lacia]


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com