Home

»

Latest News

త్రివిక్రమ్‌ నెక్స్ట్‌ మూవీ.. చిరంజీవితోనా.. సూర్యతోనా.?

Nov 20, 2026 4:41PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ నెక్స్ట్‌ మూవీ ఎవరితో చేయబోతున్నారు? ఈ ప్రశ్నకు సంబంధించి ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఒకవైపు మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు కోలీవుడ్‌ స్టార్‌ సూర్యతోనూ త్రివిక్రమ్‌ చర్చలు జరుపుతున్నారనే టాక్‌ వినిపిస్తోంది.

వెంకటేశ్‌తో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా తర్వాత త్రివిక్రమ్‌ చేయాల్సిన ప్రాజెక్ట్‌ ఎన్టీఆర్‌తో ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’. అయితే ఎన్టీఆర్‌ ఇతర సినిమాల షెడ్యూల్స్‌ కారణంగా ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కడానికి మరికొంత సమయం పట్టే అవకాశముంది. దీంతో ఈ గ్యాప్‌లో మరో సినిమాను పూర్తి చేయాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నారట.

ఈ క్రమంలోనే చిరంజీవితో సినిమా చేసే ఆలోచనకు వచ్చారని సమాచారం. ఇప్పటికే మెగాస్టార్‌కు ఓ కథ వినిపించారని, అది ఆయనకు నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్‌ సిద్ధం చేయమని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మరోవైపు త్రివిక్రమ్‌ మనసులో సూర్యతో సినిమా చేయాలనే ఆలోచన కూడా ఉందట. గతంలోనే సూర్యకు ఓ కథ చెప్పినట్లు త్రివిక్రమ్‌ స్వయంగా వెల్లడించారు. ఆ కథను ఆయనకు నచ్చేలా చెప్పలేకపోయానని, త్వరలోనే సూర్యతో సినిమా చేస్తాననే నమ్మకం ఉందని కూడా చెప్పారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌పై కొంతకాలంగా ఆసక్తి నెలకొంది.

ఇది కూడా చదవండి: తాత టైటిల్‌తో తారక్ మూవీ.. అనిల్‌ రావిపూడి ప్లాన్ మామూలుగా లేదు.!

తాజా ప్రచారం ప్రకారం, చిరంజీవితో సినిమా ఆలస్యమైతే సూర్యతో ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నారట. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు సూర్య ఇప్పటికే ఓ సినిమా చేయడానికి అంగీకరించారని, ఈ కాంబినేషన్‌ కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని టాక్‌.

మరి త్రివిక్రమ్‌ ముందుగా మెగాస్టార్‌తో సినిమా చేస్తారా? లేక సూర్యతో కొత్త ప్రయాణం మొదలుపెడతారా? ప్రస్తుతం ఈ రెండు కాంబినేషన్లపై చర్చలు జరుగుతున్నా.. ఏది ఖరారైందనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.

మీకు నచ్చవచ్చు: 
ఒసేయ్ రాములమ్మ రీమిక్స్‌.. థియేటర్లను షేక్ చేయబోతున్న రష్మిక.!
సమంతకు బాబు పుట్టాడు.. పేరు కూడా రివీల్‌ చేశారు.!

 

 

 

[Trivikram Srinivas, Chiranjeevi, Suriya, God of War, Jr NTR]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com