భార్య కోసం 'హలో గురూ ప్రేమకోసమేరోయ్' అంటూ పాడిన దిల్ రాజు.. వీడియో వైరల్!
on Dec 13, 2021

దిల్ రాజు కేవలం సినిమాకు డబ్బుపెట్టే నిర్మాత మాత్రమే కాదు. సినిమా మేకింగ్‌పై మంచి అవగాహన ఉన్న వ్యక్తి. కథల విషయంలో ఆయన జడ్జిమెంట్ 90 శాతం నిజమవుతుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉంటారు. ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా అనుభవం సంపాదించుకున్నాక ప్రొడ్యూసర్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన ఇవాళ టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ రేంజ్‌కు చేరుకున్నారు. ఆయనలో మంచి గాయకుడు కూడా ఉన్నాడని లేటెస్ట్‌గా జనాలకు తెలిసి వచ్చింది.
Also read: హాస్పిటల్‌కు వెళ్లిన సమంత.. తీవ్ర అస్వస్థత అంటూ ప్రచారం!
కరీంనగర్‌లో డ్రైవ్ ఇన్ అనే రెస్టారెంట్ ఓపెనింగ్‌కు వెళ్లిన ఆయన అక్కడ ఏర్పాటుచేసిన మ్యూజిక్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేశారు. ఆర్కెస్ట్రా మ్యూజిక్ అందిస్తుండగా స్టేజ్ మీద పాటపాడి అలరించారు. అక్కినేని నాగార్జున సినిమా 'నిర్ణయం'లో "హలో గురూ ప్రేమకోసమేరోయ్ జీవితం" పాటను ఆయన రాగయుక్తంగా ఆలపించారు. ఈ సందర్భంగా పాట చరణంలోని "నా ఎత్తు నా బరువు నీకన్నా మోర్ అమ్మా" అని పాడుతూ ఎదురుగా కూర్చొని వున్న భార్యవైపు చేయి చూపించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also read: కుమార్తెలు, మనవళ్లతో సూపర్‌స్టార్ బర్త్‌డే! ఫొటోలు వైరల్!!
2017లో మొదటి భార్య అనిత ఆకస్మిక మరణం తర్వాత, గత ఏడాది మేలో తేజస్వినిని నిజామాబాద్‌లో దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా అతికొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఒక గుడిలో వారి వివాహం జరిగింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



