
సౌత్ ఇండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ డిసెంబర్ 12న తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి 71వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా భార్య లత, కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, చిన్నల్లుడు విశాగన్, మనవళ్లతో కలిసి సందడిగా సమయాన్ని గడిపారు. వారితో కలిసి రజనీ జరుపుకున్న బర్త్‌డే పార్టీ ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు ఆదివార పుట్టినరోజు శుభాకాంక్షలతో ట్విట్టర్‌ను మోత మోగించారు.
Also read: రూ. 26 కోట్లతో జూబ్లీ హిల్స్‌లో స్థలం కొనుగోలు చేసిన మహేశ్!
ఆదివారం జరుపుకున్న 71వ బర్త్‌డే వేడుకలో రజనీ తన కుటుంబసభ్యుల సమక్షంలో రెండు కేక్‌లను కట్ చేసినట్లు ఫొటోలను బట్టి తెలుస్తోంది. ప్రతి ఏటా రజనీ ఫ్యాన్స్ ఆయన బర్త్‌డే అయిన డిసెంబర్ 12న సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం కూడా అందుకు మినహాయింపు కాదు. పలు రజనీ అభిమాన సంఘాలు రక్తదాన శిబిరాలు నిర్వహించాయి, పేదలకు అన్నదానం చేశాయి.
Also read: 'ఆర్ఆర్ఆర్' లోగోలో చరణ్ ఫోటో ముందు పెట్టడానికి కారణం?
రజనీ చివరిసారిగా శివ డైరెక్ట్ చేసిన 'అణ్ణాత్తే' (పెద్దన్న) మూవీలో కనిపించారు. నవంబర్ 4న రిలీజైన ఆ సినిమా తెలుగులో సరిగా ఆడకపోయినా, తమిళంలో మాత్రం బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఆయన తదుపరి సినిమాను ఏ డైరెక్టర్‌తో చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. దర్శకులు శివ, కార్తీక్ సుబ్బరాజ్, దేసింగ్ పెరియసామిలతో ఆయన చర్చలు జరుపుతున్నారు. తర్వలోనే ఆయన నెక్ట్స్ ఫిల్మ్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ రానున్నది.







