హాస్పిటల్‌కు వెళ్లిన సమంత.. తీవ్ర అస్వస్థత అంటూ ప్రచారం!
on Dec 13, 2021

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత అస్వస్థతకు గురయ్యింది. డిసెంబర్ 12 (ఆదివారం) ఆమె కడపలో కొత్తగా ఏర్పాటు చేసిన ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లింది. అనంతరం ప్రఖ్యాత కడప దర్గను సందర్శించి, ప్రార్థనలు చేసింది. ఆ కార్యక్రమం తర్వాత హైదరాబాద్ వచ్చిన ఆమె నిస్సత్తువకు గురయ్యింది. జలుబు, జ్వరంతో బాధపడ్డ ఆమె చికిత్స నిమిత్తం ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీకి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు మెడిసిన్స్ రాసిచ్చి, ఇంట్లో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు.
Also read: 11వ రోజు 'సైరా', 'అల.. వైకుంఠపురములో'ను మించిన 'అఖండ'!
ఈలోగా సమంతకు తీవ్ర అస్వస్థత అంటూ సోషల్ మీడియాలో, వాట్సప్ గ్రూపుల్లో అసత్య వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ ప్రచారాన్ని ఆమె మేనేజర్ మహేంద్ర ఖండించారు. సమంత ఆరోగ్యంగానే ఉన్నారనీ, దగ్గు వస్తుండటంతో హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకొని వచ్చారని చెప్పారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాన్ని నమ్మవద్దనీ ఆయన సూచించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



