'విరాట పర్వం' నుంచి రానా బర్త్ డే సర్ప్రైజ్!
on Dec 13, 2021

రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'విరాట పర్వం'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ కి, కోలు కోలు సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది.
రేపు(డిసెంబర్ 14) రానా పుట్టినరోజు సందర్భంగా 'విరాట పర్వం' నుంచి 'The Voice Of Ravanna' ను ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నట్లు తెలియజేస్తూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ లో జలపాతం దగ్గర నీటిలో కూర్చొని ఉన్న రానా, సాయి పల్లవి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోవడం కనిపిస్తోంది. రానా పుట్టినరోజు సందర్భంగా.. పవన్ కళ్యాణ్ తో కలిసి రానా నటిస్తున్న మల్టీస్టారర్ 'భీమ్లా నాయక్' నుంచి కూడా సర్ప్రైజ్ రానుందని సమాచారం.

రానా వరుస సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. రానా నటించిన '1945' డిసెంబర్ 31 న విడుదల కానుంది. 'భీమ్లా నాయక్' జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'విరాట పర్వం' కూడా ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశముందని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



