అఖండ 2 పై నారాయణ ఫైర్.. ఓజి కి ఎంత రేట్ చెప్పారు
on Dec 3, 2025

అభిమానుల పడిగాపులు
నారాయణ ఏం చెప్తున్నాడు?
అఖండ 2 కి ఎంత పెంచారు
ఓజి అప్పుడు ఎంత?
రేపు సాయంత్రం నుంచి శివస్థతుల కేరింతలు, అభిమానుల ఆనందోత్సవాల మధ్య సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(AKhanda 2)ద్వారా బాలయ్య(Balakrishna)జాతర ప్రారంభం కాబోతుంది. ప్రచార చిత్రాలతో ప్యూర్ పాజిటివ్ టాక్ ని తెచ్చుకోవడంతో మూవీ లవర్స్ కూడా పెద్దఎత్తున థియేటర్స్ కి పోటెత్తనున్నారు. దీంతో అఖండ 2 తొలి రోజు సాధించే కలెక్షన్స్ పై కూడా అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కే అన్ని బడా సినిమాలకి ఇచ్చినట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఖండ 2 కి బెనిఫిట్ షో తో పాటు కొన్ని రోజుల పాటు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది.
ఇప్పుడు ఈ విషయంపై సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ(Narayana)మాట్లాడుతు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీస్తున్నపేరుతో ప్రజల మీద భారం మోపడం సరైంది కాదు. ఇదే విధంగా టికెట్లు పెంచుకుంటు పోతే స్వయంగా ప్రభుత్వమే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టడానికి కారణమవుతుంది. పెద్ద సినిమాలకి పదే పదే రేట్లు పెంచుతున్నప్పుడు ప్రజలు పైరసీ వైపు మొగ్గుచూపుతారు. తర్వాత ఆ రవిలాంటి వారిని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తారు. కానీ అలాంటి వ్యవస్థను సృష్టించిన ప్రభుత్వం, నిర్మాతలదే తప్పు'అని స్పష్టం చేశారు.
also read: సమంత, రాజ్ పెళ్లిపై రాజ్ సోదరి పోస్ట్ వైరల్..ఇలా జరగాల్సిందే అంటున్న ఫ్యాన్స్
అఖండ 2 కి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులని ఒకసారి చూస్తే ప్రీమియర్ షోకి 600 రూపాయలు, సింగిల్ స్క్రీన్లలో 75, మల్టీప్లెక్స్‌లలో 100 రూపాయిలు పెంపుకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది. పెంచిన ధరలు డిసెంబర్ 5 నుంచి 10 రోజుల పాటు అమల్లో ఉంటాయి ఇక గత సెప్టెంబర్ లో వచ్చిన మరో పెద్ద మూవీ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వన్ మాన్ షో ఓజికి సంబంధించి బెనిఫిట్ షో టికెట్ 1000 రూపాయలతో పాటు మొదటి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలుపుకొని 125 రూపాయలు, మల్టీప్లెక్స్ 150 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



