ఆ వార్తలు నమ్మకండి.. దిల్ రాజు సంచలన ప్రకటన!
on Dec 3, 2025
.webp)
ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో సల్మాన్ ఖాన్-వంశీ పైడిపల్లి కాంబో మూవీతో పాటు పలు సినిమాలు రాబోతున్నట్లు రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దిల్ రాజు కీలక ప్రకటన చేశారు. (Dil Raju)
"శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి రాబోయే సినిమాల గురించి ఈ మధ్య రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవని, వాటిలో నిజం లేదని మేము తెలియజేస్తున్నాము" అన్నారు దిల్ రాజు.
"ఎప్పుడో వచ్చిన పాత ఊహాగానాలకు, ఇప్పటి విషయాలకు కొంత మంది ఇప్పుడు ముడిపెట్టి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మేము అక్షయ్ కుమార్ హీరోగా, అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రాథమిక పనులు జరుగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మేమే అధికారికంగా ప్రకటిస్తాము.
దయచేసి అప్పటి వరకు మా నుండి అధికారిక సమాచారం వచ్చేదాకా ఎలాంటి నిర్ధారణలకు రావొద్దని, ధృవీకరించని వార్తలను మీ మీడియాలో ప్రచారం చేయవద్దని మీడియా మిత్రులను కోరుతున్నాము" అని దిల్ రాజు తెలియజేశారు.
దిల్ రాజు స్టేట్మెంట్ ని బట్టి చూస్తే.. సల్మాన్ ఖాన్ తో సినిమా చేయనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ వచ్చింది. అదే సమయంలో అక్షయ్ కుమార్ సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



