Akhanda 2: విడుదలకు కొన్ని గంటల ముందు లీక్.. అఖండ-3 టైటిల్ ఇదే..!
on Dec 3, 2025

మరికొద్ది గంటల్లో అఖండ తాండవం
పార్ట్-3 టైటిల్ లీక్!
అఖండ తాండవానికి సమయం ఆసన్నమైంది. రేపు(డిసెంబర్ 4) రాత్రి ప్రీమియర్ షోలతో 'అఖండ-2' ప్రభంజనం మొదలుకానుంది. ఈ క్రమంలో పార్ట్-3 టైటిల్ కి సంబంధించిన చర్చ ఆసక్తికరంగా మారింది. (Akhanda 2 Thaandavam)
సింహా, లెజెండ్ తరువాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ 'అఖండ'. 2021 డిసెంబర్ లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా 'అఖండ 2: తాండవం' వస్తోంది. డిసెంబర్ 5 విడుదల తేదీ కాగా, డిసెంబర్ 4 రాత్రి నుండే ప్రీమియర్స్ పడనున్నాయి.
'అఖండ-2'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
'అఖండ' యూనివర్స్ నుండి మూడో భాగం కూడా రానుందని తెలుస్తోంది. అంతేకాదు, ఈ పార్ట్-3 కి 'జై అఖండ' అనే టైటిల్ ఫిక్స్ చేశారు అనిపిస్తోంది.
"థియేటర్లలో శివ తాండవం చూడటానికి సిద్ధంగా ఉండండి" అంటూ తాజాగా సంగీత దర్శకుడు తమన్.. డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో పాటు, టీమ్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
తమన్ షేర్ చేసిన ఫోటోలలో స్క్రీన్ మీద 'జై అఖండ' అని కనిపిస్తోంది. దీంతో పార్ట్-3 టైటిల్ అదే అయ్యుంటుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మరి నిజంగానే అఖండ-3 ఉందా? ఉంటే టైటిల్ 'జై అఖండ'నా కాదా? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



