బాలీవుడ్ బాటలో బాలయ్య `అఖండ`?
on Dec 5, 2021
నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచే దిశగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది `అఖండ` చిత్రం. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో రైతుగా, అఘోరాగా రెండు విభిన్న పాత్రల్లో మెస్మరైజ్ చేశారు బాలయ్య. మరీముఖ్యంగా.. టైటిల్ రోల్ అయిన అఘోరా పాత్రని బాలకృష్ణ అభినయించిన తీరు అభిమానులను మురిపిస్తోంది. అలాగే `సింహా`, `లెజెండ్` వంటి సెన్సేషనల్ హిట్స్ తరువాత దర్శకుడు బోయపాటి శ్రీను - బాలకృష్ణ కాంబోలో తెరకెక్కిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. వారికి హ్యాట్రిక్ ని అందించింది.
Also read: బాలకృష్ణ కెరీర్‌లో నంబర్ వన్‌గా 'అఖండ' రెండు రోజుల కలెక్షన్!
ఇదిలా ఉంటే.. కరోనా సెకండ్ వేవ్ తరువాత రికార్డు స్థాయి వసూళ్ళు ఆర్జిస్తూ టాలీవుడ్ ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తున్న `అఖండ` చిత్రాన్ని.. ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత సాజిద్ నడియాడ్ వాలా హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
Also read: చరిత్ర సృష్టించాలన్నా, తిరిగి రాయాలన్నా మనమే!
`అఖండ`లో చర్చించిన దేవాలయాల పరిరక్షణ, హిందూత్వం వంటి అంశాలకు పెద్దపీట వేస్తూ, మిగిలిన అంశాలను నేటివిటికి తగ్గట్టు మార్పుచేర్పులు చేసి.. అజయ్ దేవ్‌గణ్ లాంటి స్టార్ తో పునర్నిర్మించాలని ఆయన భావిస్తున్నారట. త్వరలోనే `అఖండ` బాలీవుడ్ రీమేక్ పై స్పష్టత వస్తుంది. మరి.. తెలుగులో సంచలనం సృష్టిస్తున్న `అఖండ` బాలీవుడ్ లోనూ అదే బాట పడుతుందేమో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
