చరిత్ర సృష్టించాలన్నా, తిరిగి రాయాలన్నా మనమే!
on Dec 3, 2021
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అఖండ'. గురువారం(డిసెంబర్ 2) విడుదలైన ఈ సినిమా 'సింహా', 'లెజెండ్'లను మించిన టాక్ తెచ్చుకొని బాలయ్య-బోయపాటి కాంబినేషన్ కి హ్యాట్రిక్ విజయాన్ని అందించింది. సెకండ్ లాక్ డౌన్ తర్వాత విడుదలైన ఈ మూవీకి వస్తున్న సూపర్ రెస్పాన్స్ కి టాలీవుడ్ స్టార్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బాలయ్య సోదరుడు నందమూరి రామకృష్ణ కూడా 'అఖండ' సంతోషం వ్యక్తం చేశారు.
"అఖండతో సినీ పరిశ్రమకి మళ్లీ పాత వైభవం వచ్చింది. కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా నష్టపోయిన సినీ పరిశ్రమకు.. అఖండ సినిమా ఒక అఖండ జ్యోతి మల్లె మంచి రోజులు వచ్చాయన్న నమ్మకం కలిగించింది. ఇక మన నందమూరి అందగాడు, నటసింహం బాలకృష్ణ గారు తన నటవిశ్వరూపం చూపెట్టారు. రికార్డులు బద్దలు కొడుతూ.. చరిత్ర సృష్టించాలన్నా, తిరిగి రాయాలన్నా మనమే అని మన నందమూరి నటసింహం నిరూపించాడు." అంటూ బాలయ్యపై ప్రశంసలు కురిపించారు రామకృష్ణ.
"ఈ చిత్ర సినిమాటోగ్రఫర్ రాంప్రసాద్ అద్భుతంగా చిత్రీకించారు. సంగీత దర్శకులు థమన్ రీ-రికార్డింగ్ అదరగొట్టేసారు. చిత్ర దర్శకులు బోయపాటి శ్రీను చాలా బాగా దర్శకత్వం వహించారు. నిర్మాత మిర్యాల రవీంద్ర గారు మునుముందు ఇటువంటి చిత్రాలు మరిన్ని నిర్మించి అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను." అంటూ అఖండ మూవీ టీమ్ ని రామకృష్ణ అభినందించారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
