Home

»

Latest News

బాల‌కృష్ణ కెరీర్‌లో నంబ‌ర్ వ‌న్‌గా 'అఖండ' రెండు రోజుల క‌లెక్ష‌న్‌!

Dec 04, 2021

 

నంద‌మూరి బాల‌కృష్ణ డ్యూయ‌ల్ రోల్ చేసిన 'అఖండ' మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్‌బ‌స్ట‌ర్ దిశ‌గా దూసుకుపోతోంది. విడుద‌లైన రెండో రోజు శుక్ర‌వారం (డిసెంబ‌ర్ 3) కూడా తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోద‌గ్గ స్థాయిలో రూ. 6.83 కోట్ల షేర్‌ను సాధించి, నిర్మాత‌ల‌ను, డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను ఆనంద‌ప‌రిచింది. తొలిరోజు బాల‌య్య కెరీర్‌లో అత్య‌ధికంగా రూ. 15.39 కోట్ల షేర్‌ను సాధించిన విష‌యం తెలిసిందే. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అఖండ రెండు రోజుల షేర్ రూ. 22.22 కోట్లకు చేరుకుంది. బాల‌య్య‌కు సంబంధించి ఏ సినిమాకైనా రెండు రోజులకు ఇదే అత్య‌ధిక షేర్‌. 

Also read:  తెలుగు రాష్ట్రాల్లో 'అఖండ' జాత‌ర‌.. అంచ‌నాల‌ను మించిన ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్‌!

రెండో రోజు తెలంగాణ‌లో రూ. 2.26 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.59 కోట్లు, రాయ‌ల‌సీమ ఏరియాలో రూ. 1.98 కోట్ల షేర్‌ను వ‌సూలు చేసింది 'అఖండ‌'. ఇక వ‌ర‌ల్డ్ వైడ్‌గా చూసుకుంటే రెండు రోజుల షేర్ 27.22 కోట్ల‌కు చేరుకుంది. నేడు మూడో రోజు కూడా నూన్ షోస్ చాలా బాగా ఉన్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు తెలిపాయి. దీంతో రెండో రోజు కంటే మూడో రోజు క‌లెక్ష‌న్స్ పెర‌గ‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. విడుద‌లైన రెండో రోజు 'అఖండ‌'ను తిల‌కించిన నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌, "బాలయ్య బాలయ్య... ఇరగతీసావయ్యా..." అంటూ త‌న ఆనందాన్ని పంచుకున్నాడు.

Also read:  ఖండ ఖండాలలో 'అఖండ' జాతర.. రికార్డుల వేట మొదలైంది!

బాల‌య్య - బోయ‌పాటి కాంబో అంటే మాస్ జాత‌ర‌ ఉంటుందో మ‌రోసారి ఈ సినిమా మ‌న‌కు చూపిస్తోంది. 2021లో విడుద‌లైన సినిమాల్లో రెండు రోజుల‌ క‌లెక్ష‌న్ల ప‌రంగా 'అఖండ' రెండో స్థానంలో నిలిచింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ 'వ‌కీల్ సాబ్' మూవీ రెండు రోజుల‌కు తెలుగు రాష్ట్రాల్లో రూ. 42.98 కోట్ల షేర్‌తో తొలి స్థానంలో ఉంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com