10 రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ సాధించిన 'అఖండ'!
on Dec 12, 2021

నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ చేసిన 'అఖండ' మూవీ రెండో వారం కలెక్షన్లు కూడా జాతరను తలపిస్తున్నాయి. విడుదలైన తొలిరోజే పాజిటివ్ టాక్ రావడం, మాస్ ఆడియెన్స్ తండోపతండాలుగా థియేటర్లకు తరలి వెళ్తుండటంతో అనూహ్య రీతిలో వసూళ్లు వస్తున్నాయి. బాలయ్య సినిమాకు థియేటర్ల దగ్గర జాతరను తలపించేలా కనిపిస్తోన్న జనాన్ని చూసి ఇలాంటి సీన్ చూసి ఎంత కాలమైందని అందరూ ఆనందపడుతున్నారు.
విడుదలైన పది రోజులకు ప్రపంచవ్యాప్తంగా 'అఖండ' వసూళ్లు రూ. 100 కోట్ల గ్రాస్‌ను చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో 2021లో ఇప్పటివరకూ విడుదలైన సినిమాల్లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచేందుకు ఈ మూవీ ఉరకలు వేస్తోంది. ఈ వారం విడుదలైన నాగశౌర్య సినిమా 'లక్ష్య' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావమూ చూపకపోవడంతో ప్రేక్షకులు ఈ వారం కూడా అఖండను చూసేందుకే మొగ్గు చూపుతున్నారు. పలువురు ప్రేక్షకులు బాలయ్య సినిమాను రెండోసారి, మూడోసారి కూడా చూస్తున్నట్లు తెలుస్తోంది.
Also read: 4 గంటలు బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్‌లో నరకయాతన పడ్డ వనిత.. ఎందుకో తెలుసా?
డిసెంబర్ 17న అల్లు అర్జున్ మూవీ 'పుష్ప' వచ్చేంతదాకా అఖండకు తిరుగులేదనేది స్పష్టం. ఈలోగా మరిన్ని వసూళ్లు దాని ఖాతాలో జమకానున్నాయి. కరోనా కాలంలోనూ థియేటర్ల దగ్గర జనాలను బారులు తీరేలా చేసిన ఘనత బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు దక్కింది. వారి మునుపటి బ్లాక్‌బస్టర్ మూవీస్ 'సింహా', 'లెజెండ్'ను మించి 'అఖండ' విజయం సాధించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Also read: 2021లో ఓవర్సీస్ బిగ్గెస్ట్ గ్రాసర్ 'అఖండ'.. 'వకీల్ సాబ్'ను దాటేశాడు!
ఈ మూవీలో బాలయ్య కవల సోదరులుగా ద్విపాత్రాభినయం చేసినప్పటికీ అఘోరా అయిన అఖండ పాత్ర వారిని అమితంగా ఆకట్టుకుంటోంది. ఇంటర్వెల్ ముందు వచ్చే అఖండ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి సినిమా జెట్ స్పీడ్‌ను అందుకోవడం, దుష్టులను తుదముట్టించడానికి అఖండ చేసే భీకర పోరాటాలు వారిని అలరిస్తున్నాయనేందుకు భారీగా నమోదవుతున్న వసూళ్లే నిదర్శనం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



