'గాలివాన' వెబ్ సిరీస్ లో సాయికుమార్, రాధిక!
on Dec 11, 2021

యువ నటీనటుల నుంచి సీనియర్ నటీనటుల వరకు ఇటీవల కాలంలో వెబ్ సిరీస్ లలో నటించి అలరిస్తున్నారు. ఇప్పుడు సీనియర్ యాక్టర్ సాయి కుమార్, సీనియర్ రాధిక శరత్ కుమార్ వంతు వచ్చింది. ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.
బిబిసి స్టూడియోస్ నిర్మించిన ఒక యూరోపియన్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి 'గాలివాన' అనే ఒరిజినల్ సిరీస్ గా బిబిసి స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో 'జీ 5' నిర్మిస్తోంది. 'తిమ్మరుసు' ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో సాయి కుమార్, రాధిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చాందినీ చౌదరి, నందిని రాయ్, చైతన్య కృష్ణ, తాగుబోతు రమేష్, జ్యోతి ప్రదీప్, ఆశ్రిత వేముగంటి ఇతర తారాగణం.
"ఇటీవలే ఈ సిరీస్ షూటింగ్ స్టార్ట్ చేసాం. ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఒక బ్రిటిష్ షోను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి తెరకెక్కించడం ఇదే తొలిసారి. ఈ వెబ్ సిరీస్ తో బిబిసి రీజనల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లోకి అడుగు పెడుతోంది" అని నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, 'జీ 5' సంస్థలు తెలిపాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



