'పుష్ప' ప్రీరిలీజ్ ఈవెంట్ కి సుకుమార్ డుమ్మా!
on Dec 12, 2021

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీస్ లో ఒకటి 'పుష్ప'. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 'పుష్ప ది రైజ్' డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేడు(డిసెంబర్ 12) ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ ఈవెంట్ కు డైరెక్టర్ సుకుమార్ రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ప్రీరిలీజ్ ఈవెంట్ అంటే హీరోతో పాటు డైరెక్టర్ కూడా సందడి చేయడం సహజం. అయితే పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్ కి మాత్రం సుకుమార్ దూరంగా ఉన్నారు. పుష్పని మొదట క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదల చేయాలనుకున్నారు. కానీ చెప్పిన దానికంటే వారం రోజుల ముందే పుష్పని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దీంతో సుకుమార్ విశ్రాంతి లేకుండా సినిమా కోసం పని చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం ముంబై వెళ్లిన ఆయన ఈవెంట్ కి రాలేకపోయారని తెలుస్తోంది. విడుదలకి ఇంకా ఐదు రోజులే సమయం ఉండటంతో ఆయన టైం అసలు వేస్ట్ చేయకుండా.. బెస్ట్ ఔట్ ఫుట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారని సమాచారం.
ఈ వేడుకకి గెస్ట్ గా వచ్చిన దర్శకధీరుడు రాజమౌళి.. సుకుమార్ రాకపోవడం కాస్త బాధ కలిగిస్తోందని అన్నారు. అయితే ఈ సినిమా కోసం సుకుమార్ ఎంతో కష్టపడుతున్నారని, ఈ సినిమా ఖఛ్చితంగా సంచలన విజయాన్ని అందుకుంటుందని రాజమౌళి అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



