2021లో ఓవర్సీస్ బిగ్గెస్ట్ గ్రాసర్ 'అఖండ'.. 'వకీల్ సాబ్'ను దాటేశాడు!
on Dec 11, 2021

'అఖండ'గా నందమూరి బాలకృష్ణ ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటికే కెరీర్ బెస్ట్ ఫిగర్స్‌ను నమోదు చేసిన 'అఖండ' మూవీ 2021లో ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' వసూళ్లను దాటేసింది. ఓవర్సీస్‌లో బాలయ్య సినిమాలకు ఇంతదాకా క్రేజ్ ఉండేది కాదు. 'అఖండ' సినిమాతో ఆ లోటును తీర్చేసుకున్నారు బాలయ్య.
'వకీల్ సాబ్' మూవీ ఓవర్సీస్‌లో రమారమి రూ. 10 కోట్ల గ్రాస్ వసూలు సాధించగా, 'అఖండ' తొలివారానికే రూ. 10.08 కోట్ల గ్రాస్‌ను వసూలుచేసి, ఈ ఏడాది ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది. ఇందులో ఒక్క యు.ఎస్.ఎ. వాటానే రూ. 6.68 కోట్లు. ఆస్ట్రేలియాలోనూ రూ. 1.26 కోట్ల గ్రాస్ రావడం విశేషంగా చెప్పుకోవాలి.
Also read: బాలయ్యతో మరోసారి ప్రగ్యా రొమాన్స్!
ఈ వారం విడుదలైన 'లక్ష్య', 'గమనం' సినిమాలకు నెగటివ్ టాక్ రావడంతో ఈ వారం కూడా ఇంటా, బయటా 'అఖండ' వసూళ్లు స్థిరంగా ఉంటాయని ఆశిస్తున్నారు. ఇప్పటికే వీకెండ్ షోస్ టికెట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో అమ్ముడయ్యాయి.
Also read: రూ. 50 కోట్ల క్లబ్‌లో 'అఖండ'! బాలయ్య కెరీర్ బెస్ట్!!
బోయపాటితో బాలయ్య కాంబినేషన్ ప్రతిసారీ వండర్ సృష్టిస్తుందని మరోసారి 'అఖండ' విజయంతో రుజువయ్యింది. 'పుష్ప' వచ్చేలోగా ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధిస్తుందనేది నిజం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



