నాలుగో రోజు కలెక్షన్‌లో 'వకీల్ సాబ్'ను దాటేసిన 'అఖండ'!
on Dec 6, 2021
నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం 'అఖండ' మూవీ బాక్సాఫీస్ దగ్గర గర్జిస్తూ దూసుకుపోతోంది. విడుదలైన నాలుగో రోజు ఆదివారం (డిసెంబర్ 5) కూడా తెలుగు రాష్ట్రాల్లో అంచనాలకు మంచి రూ. 8.31 కోట్ల షేర్‌ను సాధించి, నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లను ఆనందడోలికల్లో ముంచేసింది. తొలిరోజు ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో అత్యధికంగా రూ. 15.39 కోట్ల షేర్‌ను సాధించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 'అఖండ నాలుగు రోజుల షేర్ రూ. 37.56 కోట్లకు చేరుకుంది. బాలయ్యకు సంబంధించి ఏ సినిమాకైనా నాలుగు రోజులకు ఇదే అత్యధిక షేర్. రెండో రోజు రూ. 6.83 కోట్లు, మూడో రోజు రూ. 7.03 కోట్ల షేర్‌ను ఈ సినిమా రాబట్టింది.
Also read: బాలీవుడ్ బాటలో బాలయ్య `అఖండ`?
నాలుగో రోజు తెలంగాణలో రూ. 2.95 కోట్లు, ఆంధ్రాలో రూ. 3.33 కోట్లు, రాయలసీమ ఏరియాలో రూ. 2.03 కోట్ల షేర్‌ను వసూలు చేసింది 'అఖండ'. రెండో రోజుకు ముంచి మూడు, నాలుగు రోజుల్లో కలెక్షన్లు ఎక్కువ రావడంతో 'అఖండ' బిజినెస్‌తో సంబంధం ఉన్నవాళ్లంతా పండగ చేసుకున్నారు. ఇక బాలయ్య ఫ్యాన్స్ సంబరాలకు అంతు లేదు.
Also read: 'అఖండ' మూవీ రివ్యూ
బాలయ్య - బోయపాటి కాంబో అంటే మాస్ జాతర ఉంటుందో మరోసారి ఈ సినిమా మనకు చూపిస్తోంది. 2021లో విడుదలైన సినిమాల్లో నాలుగు రోజుల కలెక్షన్ల పరంగా 'అఖండ' రెండో స్థానంలో నిలిచింది. పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' మూవీ నాలుగు రోజులకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 57.56 కోట్ల షేర్‌తో తొలి స్థానంలో ఉంది. అయితే కేవలం నాలుగో రోజు కలెక్షన్ల విషయానికొస్తే 'వకీల్ సాబ్' కంటే 'అఖండ'దే పైచేయి. 'వకీల్ సాబ్' నాలుగో రోజు రూ. 4.19 కోట్ల షేర్ వసూలు చేసింది. దీనికి కారణం ఆరోజు సోమవారం కావడం.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
