'అఖండ'.. సినీ పరిశ్రమకి ఊపిరి పోసింది!
on Dec 6, 2021
'సింహా', 'లెజెండ్' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 'అఖండ'. డిసెంబర్ 2 న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లతో సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. సెకండ్ లాక్ డౌన్ తర్వాత విడుదలైన మొదటి భారీ బడ్జెట్ మూవీ 'అఖండ'కి జాతరను తలపిస్తూ ప్రేక్షకులు థియేటర్స్ కి కదిలి వస్తుండటంతో పెద్ద సినిమాల నిర్మాతలకు ధైర్యం వచ్చింది. అఖండ సినిమా టాలీవుడ్ లో నూతనోత్సాహం తీసుకొచ్చింది అంటూ స్టార్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు అఖండ విజయం సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు.
"సినిమా థియేటర్ కి ప్రేక్షకులు రారు, చూడరు అనుకుంటున్న క్లిష్టపరిస్థితుల్లో అఖండ విజయం సాధించిన "అఖండ" సినిమా, సినీ పరిశ్రమకి ఊపిరి పోసింది, విడుదలకి సిద్దంగా ఉన్న చాలా సినిమాలకి ధైర్యాన్నిచ్చింది. నా సోదరుడు బాలయ్యకి, ఆ చిత్ర దర్శకుడికి, నిర్మాతకి మరియు సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులకు అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందలు. మంచి సినిమాని ఆదరించే ప్రేక్షక దేవుళ్ళకు ధన్యవాదాలు" అని మోహన్ బాబు అన్నారు.
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన అఖండలో బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
