'ఆర్ఆర్ఆర్' సర్ ప్రైజ్.. గోండు బెబ్బులి లుక్ అదిరింది!
on Dec 6, 2021
మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఆర్ఆర్ఆర్' సందడి మొదలైంది. 2022, జనవరి 7 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ కి, జనని వీడియో సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 9 న ఈ మూవీ ట్రైలర్ విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా మూవీ టీమ్ సర్ ప్రైజ్ పోస్టర్ ను విడుడల చేసింది.
బాహుబలి సిరీస్ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నారు. వీరిద్దరి పాత్రలకు సంబంధించిన పోస్టర్స్, ఇంట్రో వీడియోస్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచలనకు తారాస్థాయికి తీసుకెళ్లింది. ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులలో ఉత్సాహం నింపడం కోసం మేకర్స్ ఓ సర్ ప్రైజ్ ఇచ్చారు. మూడో రోజుల్లో ట్రైలర్ రాబోతుందని తెలియజేస్తూ 'భీమ్' పోస్టర్ ను విడుదల చేశారు. భీమ్ గా తారక్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. దృఢమైన దేహంపై నెత్తుటి మరకలతో ఉన్న గోండు బెబ్బులి రూపం గూజ్ బంప్స్ తెప్పిస్తోంది.
Also Read: 'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్ కి పండగే.. ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది!
అల్లూరి సీతారామరాజు పాత్రధారి రామ్ చరణ్ కి సంబంధించిన పోస్టర్ ను కూడా ఈరోజు(సోమవారం) సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
