`శ్యామ్ సింగ రాయ్`తోనైనా మిక్కీ ట్రాక్ లోకి వస్తాడా!
on Dec 23, 2021

మెలోడీ గీతాలకు చిరునామాగా నిలుస్తున్న ఈ తరం సంగీత దర్శకుల్లో మిక్కీ జే మేయర్ ఒకరు. `హ్యాపీ డేస్`, `కొత్త బంగారు లోకం` వంటి విజయవంతమైన చిత్రాలతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన మిక్కీ.. ఆపై `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `సుబ్రమణ్యం ఫర్ సేల్`, `అ ఆ`, `శతమానం భవతి`, `మహానటి`, `ఓ బేబి, `గద్దలకొండ గణేశ్` వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ ని తన ఖాతాలో జమ చేసుకున్నాడు. 2015 నుంచి 2019 వరకు ఐదేళ్ళ పాటు ఏడాదికో హిట్ మూవీకి స్వరాలు అందించి వార్తల్లో నిలిచాడు ఈ టాలెంటెడ్ కంపోజర్.
Also Read:అప్పుడు ధనుష్.. ఇప్పుడు రజినీకాంత్..!
అయితే, `గద్దలకొండ గణేశ్` తరువాత మిక్కీ సంగీత సారధ్యంలో రూపొందిన `ఇద్దరి లోకం ఒకటే`, `శ్రీకారం` చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో.. రాబోయే `శ్యామ్ సింగ రాయ్`పైనే ఆశలు పెట్టుకున్నాడు మిక్కీ జే మేయర్. మరి.. మంచి అంచనాల నడుమ రేపు (డిసెంబర్ 24) థియేటర్స్ లోకి రాబోతున్న ఈ సినిమాతోనైనా.. మిక్కీ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.
కాగా, `శ్యామ్ సింగ రాయ్`లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించగా.. `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



