2021 జ్ఞాపకాలుః పాత టైటిల్స్ తో కొత్త చిత్రాలు!
on Dec 23, 2021

పాత చిత్రాల టైటిల్స్ తో కొత్త సినిమాలు రావడం టాలీవుడ్ లో కొత్తేమీ కాదు. ఈ ఏడాది కూడా ఈ జాబితాలో కొన్ని సినిమాలు చేరాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ `బంగారు బుల్లోడు` టైటిల్ ని తన సినిమాకి శీర్షికగా చేసుకుని.. `అల్లరి` నరేశ్ కొత్త తరహాలో సందడి చేశాడు. కాకపోతే, బాలయ్యకి కలిసొచ్చిన ఆ టైటిల్ అల్లరోడికి అంతగా అచ్చిరాలేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి పాత చిత్రాలైన `రాజా విక్రమార్క`, `ముగ్గురు మొనగాళ్ళు` టైటిల్స్ తో చేసిన కొత్త ప్రయత్నాలు కూడా అంతగా వర్కవుట్ కాలేదు. నయా `రాజా విక్రమార్క`గా కార్తికేయ కనిపించగా.. లేటెస్ట్ `ముగ్గురు మొనగాళ్ళు`గా శ్రీనివాస రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు దర్శనమిచ్చారు.
Also read:2021 జ్ఞాపకాలుః రీమేక్ చిత్రాల సందడి!
ఇక తన తండ్రి శ్రీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన `పెళ్ళి సందడి`ని టైటిల్ గా చేసుకుని.. రోషన్ హీరోగా నటించిన `పెళ్ళి సందD` మ్యూజికల్ గా మెప్పించింది. అలాగే నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఆపాతమధురం `మంచి రోజులు వచ్చాయి` టైటిల్ తో.. సంతోష్ శోభన్ హీరోగా మారుతి ఓ సినిమాని రూపొందించారు. అదేవిధంగా జగపతిబాబు నటించిన `శ్రీకారం` టైటిల్ తో శర్వానంద్ మరో సందేశం ఇచ్చే ప్రయత్నం చేయగా.. నటకిరీటీ రాజేంద్రప్రసాద్ నటించిన అలనాటి హాస్యచిత్రం `వివాహ భోజనంబు` టైటిల్ తో సత్య, సందీప్ కిషన్ కొత్తగా పలకరించారు. అలాగే లోక నాయకుడు కమల్ హాసన్ క్లాసిక్ `పుష్పక విమానం`లో ఆనంద్ దేవరకొండ కూడా మోడ్రన్ టచ్ తో ఎక్కేశాడు. అదేవిధంగా కింగ్ నాగార్జున `కిల్లర్` టైటిల్ తో కార్తీక్ సాయి కొత్త సినిమా చేయగా.. నితిన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన `ఇష్క్` సినిమా టైటిల్ తో తేజ సజ్జ సరికొత్త ప్రేమకథ అందించే ప్రయత్నం చేశాడు.
మొత్తంగా.. 2021లో దాదాపు పది పాత చిత్రాల టైటిల్స్ కొత్త సినిమాలకు శీర్షికలయ్యాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



