ఏప్రిల్ లో మైత్రీ మూవీ మేకర్స్ డబుల్ ధమాకా!
on Dec 23, 2021

విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా నిలుస్తున్న నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. ఇప్పటికే `శ్రీమంతుడు`, `జనతా గ్యారేజ్`, `రంగస్థలం`, `చిత్రలహరి`, `మత్తు వదలరా`, `ఉప్పెన` వంటి విజయాలను తమ ఖాతాలో వేసుకున్న ఈ పాపులర్ ప్రొడక్షన్ హౌస్.. తాజాగా `పుష్ప - ద రైజ్`తోనూ ఆ పరంపరని కొనసాగిస్తోంది.
ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది ఏప్రిల్ లో రెండు ఆసక్తికరమైన చిత్రాలను అందించేందుకు సన్నాహాలు చేస్తోంది మైత్రీ సంస్థ. ఆ వివరాల్లోకి వెళితే.. `శ్రీమంతుడు` తరువాత సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న `సర్కారు వారి పాట` 2022 ఏప్రిల్ 1న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. నేచురల్ స్టార్ నానితో మైత్రీ నిర్మిస్తున్న `అంటే.. సుందరానికీ!` కూడా అదే నెలలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఏప్రిల్ లో విడుదల కాబోతున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నాని. మరి.. ఒకే నెలలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ తో మైత్రీ సంస్థ ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.
Also read:మరోసారి.. `RX 100` కాంబో!
కాగా, 2018 నవంబర్ లో యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా నటించిన `సవ్యసాచి`, మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన `అమర్ అక్బర్ ఆంటోని` చిత్రాలను రెండు వారాల వ్యవధిలో విడుదల చేసింది మైత్రీ మూవీ మేకర్స్. ఆ రెండు సినిమాలు కూడా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



