Home

»

Latest News

అప్పుడు ధ‌నుష్.. ఇప్పుడు ర‌జినీకాంత్..!

Dec 22, 2021 4:26PM

పేరుకి త‌మిళ‌య‌న్ అయినా.. బాలీవుడ్ ద‌ర్శ‌కుడిగానే గుర్తింపు పొందారు ఆర్. బల్కి (ఆర్. బాల‌కృష్ణ‌న్). తంజావూరుకి చెందిన ఈ టాలెంటెడ్ కెప్టెన్.. `చీనీ క‌మ్`, `పా`, `ష‌మితాబ్`, `కి అండ్ కా`, `ప్యాడ్ మాన్` సినిమాల‌తో హిందీనాట త‌నదైన ముద్ర వేశారు. ప్ర‌స్తుతం దుల్క‌ర్ స‌ల్మాన్, స‌న్నీ డియోల్, పూజా భ‌ట్, శ్రేయా ధ‌న్వంత‌రి కాంబినేష‌న్ లో `చుప్ః  రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్` అనే సినిమా చేస్తున్నారు బ‌ల్కి. వ‌చ్చే ఏడాది ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేట‌ర్స్ లోకి రానుంది.

ఇదిలా ఉంటే.. త్వ‌ర‌లో బ‌ల్కి ఓ పాన్ - ఇండియా మూవీ చేస్తున్నార‌ట‌. అది కూడా.. సూప‌ర్ స్టార్ రజినీకాంత్ తో. ఓ డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో రూపొంద‌నున్న ఈ సినిమాకి మ్యూజిక్ మేస్ట్రో ఇళ‌య‌రాజా బాణీలు అందించ‌నున్నార‌ని స‌మాచారం. `ప్యాడ్ మాన్`కి మిన‌హాయిస్తే బ‌ల్కి డైరెక్టోరియ‌ల్స్ అన్నింటికి కూడా ఇళ‌య‌రాజానే స్వ‌రాలు స‌మ‌కూర్చారు. అంతేకాదు.. `వీర‌` (1994) త‌రువాత ర‌జినీ, ఇళయ‌రాజా ఈ సినిమా కోస‌మే మ‌ళ్ళీ జ‌ట్టుక‌ట్ట‌నున్నార‌నే వార్త‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. గ‌తంలో ర‌జినీ అల్లుడు, వెర్స‌టైల్ స్టార్ ధ‌నుష్ తో `ష‌మితాబ్` చేసిన బ‌ల్కి.. ఇప్పుడు ర‌జినీతోనే సినిమా చేయ‌నుండ‌డం.

మ‌రి.. సూప‌ర్ స్టార్ తో చేయ‌బోతున్న ఈ వినూత్న‌ ప్ర‌య‌త్నం.. బ‌ల్కికి ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో చూడాలి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com