వెంకీ, సూర్య.. సేమ్ టు సేమ్!
on Feb 4, 2022

వైవిధ్యానికి పెద్దపీట వేసే కథానాయకులుగా టాలీవుడ్ టాప్ స్టార్ విక్టరీ వెంకటేశ్, కోలీవుడ్ స్టార్ సూర్యకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకవైపు డిఫరెంట్ రోల్స్ చేస్తూనే.. మరోవైపు రెగ్యులర్ మూవీస్ కూడా చేయడం వీరిద్దరి శైలి.
Also Read: రవితేజతో ఫారియా, ప్రియాంక రొమాన్స్!
ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా అటు వెంకీ, ఇటు సూర్య జర్నీ ఒకేలా సాగుతోంది. కరోనా ఎఫెక్ట్ తో వీరిద్దరి గత రెండు చిత్రాలు ఒకే ఓటీటీ వేదికలో స్ట్రీమ్ అయి వీక్షకులను రంజింపజేయగా.. తాజా సినిమాలు మాత్రం థియేటర్స్ బాట పడుతుండడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే.. వెంకీ గత రెండు చిత్రాలు `నారప్ప`, `దృశ్యం 2` అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాగా, సూర్య ప్రీవియస్ మూవీస్ `సూరరై పోట్రు` (తెలుగులో `ఆకాశం నీ హద్దురా!`), `జై భీమ్` కూడా అదే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయ్యాయి. అలా.. ఇద్దరు కూడా ఓటీటీలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూశారు. కట్ చేస్తే.. ఇప్పుడు వెంకీ తాజా చిత్రం `ఎఫ్ 3`, సూర్య కొత్త సినిమా `ఎదర్కుమ్ తుణిందవన్` మాత్రం థియేటర్స్ లోకి రాబోతున్నాయి. మరి.. రెండు ఓటీటీ హిట్స్ అనంతరం థియేటర్స్ బాట పడుతున్న వెంకీ, సూర్య ఈ సారి ఎలాంటి ఫలితాన్ని పొందుతారో చూడాలి.
Also Read: రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో నాగచైతన్య! జానర్ ఏంటో తెలుసా?
కాగా వెంకీ `ఎఫ్ 3` ఏప్రిల్ 28న రిలీజ్ కానుండగా, సూర్య `ఈటీ` మార్చి 10న పలు భాషల్లో సందడి చేయనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



