హిలేరియస్ ఎంటర్టైనర్ `క్షేమంగా వెళ్ళి లాభంగా రండి`కి 22 ఏళ్ళు!
on Feb 4, 2022

విజయవంతమైన రీమేక్ చిత్రాలకు పెట్టింది పేరు.. ఎం.ఎల్. ఆర్ట్ మూవీస్ సంస్థ. ఈ బేనర్ పై వచ్చిన సక్సెస్ ఫుల్ మూవీస్ లో `క్షేమంగా వెళ్ళి లాభంగా రండి` ఒకటి. తమిళ చిత్రం `విరలుక్కేత్త వీక్కమ్` ఆధారంగా రూపొందిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ లో శ్రీకాంత్, రోజా, రాజేంద్ర ప్రసాద్, రుక్మిణి, బ్రహ్మానందం, కోవై సరళ, ప్రకాశ్ రాజ్ , రమ్యకృష్ణ, రవితేజ, ఎమ్మెస్ నారాయణ, గిరిబాబు, చలపతి రావు, జయప్రకాశ్ రెడ్డి, సూర్య, అల్ఫోన్సా ముఖ్య పాత్రల్లో నటించారు. రాజా వన్నెం రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి ఎడిటర్ మోహన్ స్క్రీన్ ప్లే సమకూర్చగా, రాజేంద్ర కుమార్ సంభాషణలు అందించారు.
Also Read: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. కొంతకాలంగా ఒకే ఇంట్లో!
వందేమాతరం శ్రీనివాస్ సంగీతమందించిన ఈ చిత్రానికి `సిరివెన్నెల` సీతారామశాస్త్రి, చంద్రబోస్ సాహిత్యమందించారు. ``లవ్వుకి ఏజ్ బారుందా రంగనాయకి``, ``జోరు జోరుగా``, ``ఆడవాళ్ళమండి``, ``అప్పు చేసి పప్పు కూడు``, ``ఒక్కరి కోసం``.. ఇలా ఇందులోని గీతాలన్నీ ఆకట్టుకున్నాయి. ఎడిటర్ మోహన్ సమర్పణలో ఎం.వి. లక్ష్మి నిర్మించిన ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా.. 2000 ఫిబ్రవరి 4న విడుదలై ఘనవిజయం సాధించింది. నేటితో ఈ చిత్రం 22 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



