Home

»

Gossips

రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ష‌న్‌లో నాగ‌చైత‌న్య‌! జాన‌ర్ ఏంటో తెలుసా?

Jan 7, 2022 9:36AM

 

'శ్యామ్ సింగ రాయ్' సినిమా వ‌చ్చాక అందరి దృష్టీ దాని డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్యాన్ మీద‌కు మ‌ళ్లింది. టైటిల్ రోల్‌లో నానిని, దేవ‌దాసి క్యారెక్ట‌ర్‌లో సాయిప‌ల్లివిని అత‌ను చూపించిన విధానం, మొత్తం మూవీని అత‌ను రూపొందించిన తీరు ఇటు విమ‌ర్శ‌కుల్నీ, అటు ప్రేక్ష‌కుల్నీ బాగా మెప్పించింది. నాని, సాయిప‌ల్ల‌వి కెరీర్‌ల‌లో బెస్ట్ రోల్స్‌, బెస్ట్ ప‌ర్ఫెర్మెన్స్ ఇవే అనే ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. ఆ క్రెడిట్ అంతా రాహుల్‌దేన‌ని అంతా చెప్పుకుంటున్నారు. 

Also read: 'ఆచార్య'కు 'శానా కష్టం' వచ్చింది.. కొరటాలపై పోలీసులకు ఫిర్యాదు!

ప్ర‌స్తుతం 'శ్యామ్ సింగ రాయ్' విజ‌యాన్ని ఆస్వాదిస్తోన్న రాహుల్‌, త‌న త‌ర్వాత సినిమాని ఎవ‌రితో చేస్తాడ‌నే ఆస‌క్తి ఇండ‌స్ట్రీలో వ్య‌క్త‌మ‌వుతోంది. అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం నాని త‌ర్వాత నాగ‌చైత‌న్య‌ను డైరెక్ట్ చేయాల‌ని రాహుల్ భావిస్తున్నాడు. ఇప్ప‌టికే అత‌ను చైతూకి స‌బ్జెక్ట్ చెప్పాడ‌నీ, అది న‌చ్చ‌డంతో చైతూ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌నీ తెలిసింది. ఈసారి టైమ్ ట్రావెల్ జాన‌ర్ స‌బ్జెక్టును రాహుల్ డీల్ చేయ‌నున్నాడు.

Also read: బోయపాటి దర్శకత్వంలో పవర్ స్టార్!

ఈ కాంబినేష‌న్‌తో సినిమాని ఎవ‌రు నిర్మిస్తార‌నే విష‌యం ఇంకా తెలియాల్సి ఉంది. త్వ‌ర‌లోనే అది కూడా వెల్లడి కానున్న‌ది. తండ్రి నాగార్జున‌తో క‌లిసి చైతూ న‌టించిన 'బంగార్రాజు' ఈనెల 14న విడుద‌ల‌వుతోంది. మ‌రోవైపు అత‌ను విక్ర‌మ్ కుమార్ డైరెక్ష‌న్‌లో 'థాంక్ యూ' మూవీని చేస్తున్నాడు. 2022లోనే రాహుల్ డైరెక్ష‌న్‌లో అత‌ను న‌టించే సినిమా మొద‌ల‌వ‌నున్న‌ది. అయితే అది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేది మాత్రం 2023లోనే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com