తారక్, చరణ్.. ఇద్దరికీ సూపరే!
on Feb 4, 2022

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా `ఆర్ ఆర్ ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్.. వేసవి కానుకగా మార్చి 25న విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ క్రేజీ వెంచర్ పై భారీ అంచనాలే ఉన్నాయి.
Also Read: మెగాస్టార్ తో నాగశౌర్య!
ఇదిలా ఉంటే.. అటు తారక్ కి, ఇటు చరణ్ కి మార్చి నెల ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే.. గతంలో ఈ ఇద్దరికీ మార్చి నెల భలేగా అచ్చొచ్చింది. ఎన్టీఆర్ కెరీర్ లో తొలి సెన్సేషనల్ హిట్ అయిన `ఆది` 2002లో ఇదే మార్చి చివరి వారం (మార్చి 28)లో విడుదల కాగా.. రామ్ చరణ్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన `రంగస్థలం` కూడా 2018లో ఇదే మార్చి చివరి వారం (మార్చి 30)లో జనం ముందు నిలిచింది. కట్ చేస్తే.. అటు `ఆది` తరువాత తారక్ నుంచి, ఇటు `రంగస్థలం` అనంతరం చరణ్ నుంచి మార్చి నెలలో వస్తున్న సినిమా `ఆర్ ఆర్ ఆర్`నే కావడం విశేషం. మరి.. తమ కెరీర్ లో మెమరబుల్ మంత్ గా నిలిచిన మార్చి నెలలో వస్తున్న `ఆర్ ఆర్ ఆర్`తో.. తారక్, చరణ్ ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.
Also Read: చరణ్ కి జోడీగా `లోఫర్` భామ!
కాగా, `ఆర్ ఆర్ ఆర్`లో ఎన్టీఆర్ కి జంటగా ఒలివియా మోరీస్ నటించగా, రామ్ చరణ్ కి జోడీగా ఆలియా భట్ కనిపించనుంది. స్వరవాణి కీరవాణి బాణీలతో ఈ ఫిక్షనల్ డ్రామా రూపొందింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



