బాలయ్య రీమిక్స్.. సేమ్ టు సేమ్
on Jan 22, 2021
నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమాల్లోని పాటలు రీమిక్స్ అయిన సందర్భాలు తక్కువే. అయితే.. రీమిక్స్ చేసిన సినిమాలకు మంచి ఫలితాలే దక్కాయి. అలాంటి చిత్రాల్లో పటాస్ ఒకటి. ఇందులో నందమూరి కళ్యాణ్ రామ్ తన బాబాయ్ బాలయ్య నటించిన రౌడీ ఇన్స్ పెక్టర్ చిత్రంలోని అరె వో సాంబ పాటని రీమిక్స్ చేశాడు. కట్ చేస్తే.. చాన్నాళ్ళుగా సరైన విజయాలు లేని కళ్యాణ్ రామ్ కి బ్లాక్ బస్టర్ దక్కింది. 2015 జనవరి 23న కళ్యాణ్ రామ్ కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ పటాస్ జనం ముందుకు వచ్చింది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. సరిగ్గా అదే జనవరి 23న బాలయ్య పాటని రీమిక్స్ చేసి మరో హీరో ఇప్పుడు అదృష్ట పరీక్షకు సిద్ధమయ్యాడు. అతను మరెవరో కాదు.. కామెడీ హీరో అల్లరి నరేష్. బాలయ్య టైటిల్ బంగారు బుల్లోడుతో సినిమా చేయడమే కాకుండా.. అందులోని ఎవర్ గ్రీన్ రెయిన్ సాంగ్ స్వాతిలో ముత్యమంతని రీమిక్స్ చేశాడు. పాటకైతే మంచి రెస్పాన్స్ వస్తోంది. మరి.. సినిమా కూడా జనాదరణ పొందుతుందేమో చూడాలి.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. పటాస్ కి, బంగారు బుల్లోడుకి సాయి కార్తిక్ నే స్వరకర్త. మరి.. సేమ్ డేట్.. సేమ్ మ్యూజిక్ డైరెక్టర్.. సేమ్ బాలయ్య ఫ్యాక్టర్.. బంగారు బుల్లోడుకి కూడా అచ్చొస్తాయేమో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
