బాల కోసం సూర్య ప్రయోగం!
on Mar 8, 2022

కోలీవుడ్ స్టార్ సూర్య, వెర్సటైల్ కెప్టెన్ బాలది సూపర్ హిట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన `నంద` (2001), `పితామగన్` (2003) చిత్రాలు తమిళనాట మంచి విజయం సాధించాయి. మరీ ముఖ్యంగా.. `నంద` అయితే అప్పట్లో సూర్యకి నటుడిగా మంచి గుర్తింపుని తీసుకువచ్చింది. అలాగే బాల రూపొందించిన `అవన్ - ఇవన్`(2011) కోసం ఓ ప్రత్యేక పాత్రలో సందడి చేశారు సూర్య.
ఇదిలా ఉంటే, సుదీర్ఘ విరామం అనంతరం సూర్య, బాల మరోమారు జట్టుకట్టనున్నారు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేయనున్నాడట. అంతేకాదు.. ఒక పాత్ర కోసం చెవిటి, మూగ యువకుడిగా కనిపిస్తాడట సూర్య. ఈ ప్రయోగాత్మక పాత్రకి జోడీగా సూర్య శ్రీమతి, ప్రముఖ నటి జ్యోతిక దర్శనమివ్వనుందని సమాచారం. మరి.. చాన్నాళ్ళ తరువాత అటు బాలతోనూ, ఇటు జ్యోతికతోనూ కలిసి పనిచేయనున్న సూర్యకి.. ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
Also Read: తమ్ముడు ధనుష్ కి విలన్ గా అన్న సెల్వ రాఘవన్!?
కాగా, సూర్య తాజా చిత్రం `ఎదర్కుమ్ తుణిందవన్` ఈ నెల 10న రిలీజ్ కానుంది. పాన్ - ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులో `ఈటీ` పేరుతో అనువాదమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



