తమ్ముడు ధనుష్ కి విలన్ గా అన్న సెల్వ రాఘవన్!?
on Mar 7, 2022

కోలీవుడ్ లో క్లాసిక్స్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు దర్శకుడు సెల్వ రాఘవన్. తెలుగువారికి శ్రీరాఘవగా సుపరిచితులైన ఈ టాలెంటెడ్ కెప్టెన్.. `7జీ బృందావన కాలనీ`, `ఆడవారి మాటలకు అర్థాలే వేరులే` చిత్రాలతో ఇక్కడివారిని విశేషంగా అలరించారు. అలాగే, `యుగానికి ఒక్కడు` వంటి అనువాద చిత్రంతోనూ ఆకట్టుకున్నారు.
Also Read: సోనాక్షి సిన్హా పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
ఇదిలా ఉంటే, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన సెల్వ రాఘవన్.. తాజాగా నటుడి అవతారమెత్తారు. ఇందులో భాగంగా.. త్వరలో కేరళకుట్టి కీర్తి సురేశ్ తో కలిసి `సాని కాయిదమ్`, కోలీవుడ్ స్టార్ విజయ్ తో కలిసి `బీస్ట్` చిత్రాల్లో యాక్టర్ గా ఎంటర్టైన్ చేయనున్నారు రాఘవన్. అంతేకాదు.. ఈ రెండు సినిమాల్లోనూ రొటీన్ కి భిన్నమైన వేషాల్లో ఆయన కనిపిస్తారని వినిపిస్తోంది. కాగా, ప్రస్తుతం తన తమ్ముడు ధనుష్ తో రూపొందిస్తున్న `నానే వరువేన్` లోనూ సెల్వ రాఘవన్ ఓ ముఖ్య భూమిక పోషిస్తున్నారట. ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ప్రతినాయకుడిగా సెల్వ కనిపిస్తారని సమాచారం. మరి.. తన డైరెక్షన్ లో తనే నటించడంతో పాటు, తమ్ముడికి ఫస్ట్ టైమ్ విలన్ గా మారిన ఈ `7జీ` కెప్టెన్.. ఎలాంటి గుర్తింపుని, ఫలితాన్ని పొందుతారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



