చిన్న బ్రేక్.. ఫిన్లాండ్ లో ఉపాసనతో చరణ్
on Mar 8, 2022

కొంతకాలంగా వరుస సినిమా షూటింగ్స్ తో ఫుల్ బిజీగా గడిపిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విరామం తీసుకున్నాడు. తన సతీమణి ఉపాసనతో ఫిన్లాండ్ వెళ్ళాడు. అక్కడ ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నాడు.
రామ్ చరణ్ ప్రధాన పాత్ర పోషించిన 'ఆర్ఆర్ఆర్' మార్చి 25 న విడుదల కానుంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మరో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రధాన పాత్ర పోషించడం విశేషం. తారక్ మూడేళ్ళుగా ఆర్ఆర్ఆర్ తప్ప మరే ఇతర సినిమా చేయలేదు. కానీ చరణ్ మాత్రం ఆర్ఆర్ఆర్ షూట్ గ్యాప్ లో తన తండ్రి చిరంజీవితో కలిసి చేస్తున్న'ఆచార్య' మూవీ షూటింగ్ పూర్తి చేశాడు. అలాగే, శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేశాడు. ఇటీవల ఈ మూవీ షూటింగ్ రాజమండ్రిలో జరిగింది. ఇప్పుడు ఆ మూవీకి విరామం రావడంతో చరణ్ తన భార్య ఉపాసనతో ఫిన్లాండ్ వెళ్ళాడు.

ఉపాసనతో కలిసి చరణ్ ఫిన్లాండ్ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చరణ్ న్యూ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. శంకర్ మూవీలో చరణ్ ఈ లుక్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. చరణ్ ఫిన్లాండ్ నుంచి తిరిగొచ్చాక ఈ మూవీ షూటింగ్ మళ్ళీ కొనసాగనుందని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



