ఫస్ట్ సూర్యతో.. నెక్స్ట్ ప్రభాస్ తో..!
on Mar 7, 2022

`బాహుబలి` సిరీస్ తో పాన్ - ఇండియా యాక్టర్ అనిపించుకున్నారు కోలీవుడ్ స్టార్ సత్యరాజ్. ఆ సిరీస్ లో సత్య పోషించిన `కట్టప్ప` పాత్ర నటుడిగా తనకి ఎనలేని గుర్తింపుని తీసుకువచ్చింది. అలాగే, పలు ఆసక్తికరమైన అవకాశాలను అందించింది.
ఇదిలా ఉంటే, ఈ మార్చి రెండో వారం సత్యరాజ్ కి ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. రెండు వరుస రోజుల్లో తను నటించిన రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ పలు భాషల్లో సందడి చేయనున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ స్టార్ సూర్యతో కలిసి సత్యరాజ్ నటించిన తమిళ సినిమా `ఎదర్కుమ్ తుణిందవన్`. మార్చి 10న విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో సూర్యకి తండ్రిగా దర్శనమివ్వనున్నారు సత్యరాజ్. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో `ఈటీ` పేరుతో అదే రోజున ఈ సినిమా అనువాద రూపంలో సందడి చేయనుంది.
Also Read: బాలయ్యకి చెల్లెలుగా `జయమ్మ`.. రేపు స్పెషల్ పోస్టర్!?
ఇక `మిర్చి`, `బాహుబలి` సిరీస్ అనంతరం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సత్యరాజ్ కలిసి నటించిన సినిమా `రాధే శ్యామ్`. తెలుగు వెర్షన్ లో రెబల్ స్టార్ కృష్ణంరాజు పోషించిన పరమహంస పాత్రని ఇతర భాషల్లో సత్యరాజ్ ధరించారు. `ఈటీ` విడుదలైన మరుసటి రోజు అంటే మార్చి 11న ఈ పిరియడ్ లవ్ సాగా రిలీజ్ కానుంది.
మరి.. ఫస్ట్ సూర్యతో, నెక్స్ట్ ప్రభాస్ తో వెంటవెంటనే సందడి చేయనున్న సత్యరాజ్ కి ఆయా చిత్రాలు ఎలాంటి ఫలితాన్ని, గుర్తింపుని అందిస్తాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



