బాలయ్యకి చెల్లెలుగా `జయమ్మ`.. రేపు స్పెషల్ పోస్టర్!?
on Mar 4, 2022

`విలక్షణ నటుడు శరత్ కుమార్ తనయ` అనే ట్యాగ్ తో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన వరలక్ష్మీ శరత్ కుమార్.. అనతి కాలంలోనే నటిగా తనదైన ముద్ర వేసింది. తండ్రి శరత్ కుమార్ తరహాలోనే విభిన్న పాత్రలకు చిరునామాగా నిలుస్తూ వెర్సటైల్ యాక్ట్రస్ గా ముందుకు సాగుతోంది. ఇప్పటికే తమిళనాట నటిగా తనదైన అభినయంతో అలరించిన వరలక్ష్మి.. గత సంవత్సరం `క్రాక్`, `నాంది` సినిమాలతో తెలుగులోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్న తెలుగు చిత్రాల్లో `ఎన్బీకే 107` ఒకటి. నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా టాలెంటెడ్ కెప్టెన్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో.. ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది వరలక్ష్మి. `క్రాక్` తరువాత గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో చేస్తున్న ఈ చిత్రంలో.. బాలయ్యకి చెల్లెలుగా నెగటివ్ షేడ్స్ లో కనిపించనుందట `జయమ్మ` (`క్రాక్`లో వరలక్ష్మి పాత్ర పేరు). అంతేకాదు.. రేపు (మార్చి 5) వరలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ పోస్టర్ ని ప్లాన్ చేసిందట. మరి.. బాలయ్య కాంబినేషన్ లో వరలక్ష్మి ఓ మెమరబుల్ హిట్ ని క్రెడిట్ చేసుకుంటుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



