'రాధే శ్యామ్'ను మేమోరకంగా చూస్తే, తమన్ ఇంకో రకంగా చూపించాడు!
on Mar 7, 2022

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పీరియడ్ లవ్ స్టోరీ 'రాధే శ్యామ్' మార్చి 11న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ స్కేల్‌లో రిలీజవుతోంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ సాంగ్స్‌కు జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తే, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సమకూర్చాడు. మూవీని తాము ఓ రకంగా చూస్తే, తన బీజీయంతో తమన్ మరోలా ఆ సినిమాను చూపించాడంటూ అతనిని ప్రశంసించాడు ప్రభాస్. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ప్రభాస్ సినిమా గురించి అడిగిన పలు ప్రశ్నలకు జవాబిచ్చాడు.
"సినిమాని మేం ఒకలా చూశాం, డైరెక్టర్ రాధాకృష్ణ కానీ, మేం కానీ క్లాసిక్ టచ్ ఇద్దామన్నట్లు వేరేలా చూశాం. తమన్ సినిమా చూసి, 'నాకీ సినిమా నచ్చింది, చేస్తాను' అని తనే వచ్చి అడిగాడు. అతనే వచ్చి చేస్తాననడంతో 'అమ్మయ్య.. మనకు స్ట్రెస్ పోయింది' అనుకున్నాం. అతను మ్యూజిక్ ఇచ్చిన తర్వాత సినిమా చూస్తే.. అతను సినిమాని ఇంకోలా లేపాడు. మాకు వేరే సినిమా చూపించాడు" అని చెప్పాడు ప్రభాస్.
ఆర్కెస్ట్రైజేషన్ కానీ, సౌండింగ్ కానీ.. గ్రాండ్ విజువల్ వచ్చిందని ఆయన అన్నాడు. "ట్రైన్ సీన్స్ చూసినా, షిప్ సీన్స్ చూసినా.. ఒకసారి సీన్‌లోకి తమన్ రాగానే.. ఓహో ఈ సినిమాని ఇలా చూడాలా అని మాకు అనిపించింది. మా సినిమాని వేరే లెవల్‌కు తీసుకెళ్లిన తమన్‌కు చాలా థాంక్స్." అని చెప్పుకొచ్చాడు ప్రభాస్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



