ENGLISH | TELUGU  

ఆగస్ట్‌ 10న రవితేజ పవర్ ఆడియో

on Aug 5, 2014

 

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై కె.ఎస్‌.రవీంద్రనాథ్‌(బాబి) దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మిస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పవర్‌’(అన్‌లిమిటెడ్‌). ఈ చిత్రానికి సంబంధించిన బ్యాంకాక్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌ అయింది.

 

ఈ సందర్భంగా దర్శకుడు కె.ఎస్‌.రవీంద్రనాథ్‌(బాబి) మాట్లాడుతూ ` ‘‘బ్యాంకాక్‌లో రెండు కోట్ల రూపాయల బడ్జెట్‌తో భారీ ఛేజ్‌ కంప్లీట్‌ చేశాం. ఈ ఛేజ్‌ను చాలా హైలెవల్‌లో చిత్రీకరించడం జరిగింది. ఈ ఛేజ్‌ సినిమాకే హైలైట్‌ అవుతుంది. ఆగస్ట్‌ 6 నుంచి 10 వరకు రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన భారీ సెట్‌లో రవితేజ, హన్సికలపై ఓ పాట చిత్రీకరించబోతున్నాం. దీంతో టోటలగా షూటింగ్‌ పూర్తవుతుంది. రవితేజలోని మాస్‌ పవర్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ పవర్‌ రెండూ మిక్స్‌ అయిన పవర్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది’’ అన్నారు.



నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌ మాట్లాడుతూ ‘‘మా బేనర్‌లో రవితేజతో చేస్తున్న సూపర్‌ డూపర్‌హిట్‌ మూవీ ఇది. ఈ నెల 10న శిల్పకళావేదికలో చాలా గ్రాండ్‌గా ఈ చిత్రం ఆడియోను రిలీజ్‌ చేస్తున్నాం. అలాగే ఆగస్ట్‌ 29న వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేశాం’’ అన్నారు.




మాస్‌ మహారాజా రవితేజ సరసన హన్సిక, రెజినా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, ముఖేష్‌ రుషి, సంపత్‌రాజ్‌, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ, జీవా, సుబ్బరాజు, అజయ్‌, సప్తగిరి, సురేఖావాణి, కాశీ విశ్వనాథ్‌, జయలక్ష్మి, వినయప్రసాద్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. థమన్‌, ఫొటోగ్రఫి: జయనన్‌ విన్సెంట్‌, మనోజ్‌ పరమహంస, ఎడిటింగ్‌: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే: కె.చక్రవర్తి, మోహనకృష్ణ ఆర్ట్‌: బ్రహ్మకడలి, మాటలు: కోన వెంకట్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, ఛేజ్‌: అలెన్‌ అమిన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: జె.జి.కృష్ణ, ఛీఫ్‌ కో`డైరెక్టర్‌: ఎస్‌.సురేష్‌కుమార్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: పి.అజయ్‌కుమార్‌,ా్మత: రాక్‌లైన్‌ వెంకటేష్‌, కథ-స్క్రీన్‌ప్లే`మాటలు` దర్శకత్వం: కె.ఎస్‌.రవీంద్రనాధ్‌ (బాబి).


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.