Home

»

Latest News

వ‌క్కంతం వంశీకి ర‌వితేజ గ్రీన్ సిగ్న‌ల్‌

Mar 13, 2020 5:26PM

 

ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌ర చిత్రాల‌తో బిజీగా ఉన్న మాస్ మ‌హారాజా ర‌వితేజ, మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందే ఈ సినిమాను వ‌క్కంతం వంశీ డైరెక్ట్ చేయ‌నున్నాడు. టాలీవుడ్ టాప్ రైట‌ర్స్‌లో ఒక‌డిగా పేరున్న‌ వ‌క్కంతం వంశీ, ద‌ర్శ‌కుడిగా మారి తొలి య‌త్నంగా అల్లు అర్జున్‌తో 'నా పేరు సూర్య‌.. నా ఇల్లు ఇండియాస మూవీని రూపొందించిన విష‌యం తెలిసిందే. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆ సినిమా బోల్తా కొట్టింది. 

ఆ చేదు అనుభ‌వాన్ని మ‌ర‌చిపోయి, ఇప్పుడు ఆయ‌న ర‌వితేజ కోసం ఒక మంచి స్క్రిప్ట్ సిద్ధం చేసిన‌ట్లు స‌మాచారం. గ‌తంలో ఆయ‌న ర‌వితేజ న‌టించిన ట‌చ్ చేసి చూడు, కిక్‌, కిక్ 2 సినిమాల‌కు రైట‌ర్‌గా ప‌నిచేశాడు. వంశీ వినిపించిన స్క్రిప్ట్ బాగా న‌చ్చ‌డంతో, ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డానికి ర‌వితేజ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎవ‌రు నిర్మిస్తారు, ఇందులో హీరోయిన్ ఎవ‌రు అనే వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించనున్నారు. ఈ సినిమా అయినా వంశీకి తీపి అనుభ‌వాన్నిస్తుందేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com