రవితేజతో దర్శకుడిగా... అల్లు అర్జున్‌తో రచయితగా!
on Mar 14, 2020

వక్కంతం వంశీకి ఇప్పుడు రెండు చేతులా పని దొరికింది. ఒకపక్క దర్శకుడిగా తన చిత్రానికి పని చేస్తూనే... మరోపక్క రచయితగా ఇంకో సినిమాకు కథను అందిస్తున్నాడు. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నిర్మాత ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. కానీ, వక్కంతం వంశీకి రవితేజ మాటిచ్చాడు. అతని దర్శకత్వంలో సినిమా చేస్తానని! ఆల్రెడీ కథ లాక్ అయ్యిందట. ఈ సినిమాతో పాటు సుకుమార్ సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా చేయబోయే చిత్రానికి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. ఆ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారని సమాచారం.
దర్శకుడు సురేందర్ రెడ్డి, రచయిత వక్కంతం వంశీది సూపర్ హిట్ కాంబినేషన్. రవితేజ 'కిక్', అల్లు అర్జున్ 'రేసుగుర్రం' హిట్స్ ఈ కాంబినేషన్ నుండి వచ్చినవే. మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందన్నమాట. ప్రస్తుతం అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ మధ్య చర్చలు జరుగుతున్నాయట. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'తో వక్కంతం వంశీని అల్లు అర్జున్ దర్శకుడిగా పరిచయం చేశారు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా అతని ప్రతిభపై నమ్మకం ఉంచారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



