చరణ్ ఫస్ట్ గ్లింప్స్ కి డేట్ ఫిక్స్!?
on Jan 27, 2022

ఈ వేసవిలో `ఆచార్య`, `ఆర్ ఆర్ ఆర్` చిత్రాలతో తక్కువ గ్యాప్ లోనే సందడి చేయబోతున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. మల్టిస్టారర్స్ గా రూపొందిన ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి.
Also Read: అట్లీ దర్శకత్వంలో బన్నీ స్టైలిష్ యాక్షన్ డ్రామా!?
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సంచలన దర్శకుడు శంకర్ నిర్దేశకత్వంలో తన కొత్త చిత్రం చేస్తున్నాడు రామ్ చరణ్. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వాని నటిస్తుండగా.. అంజలి, సునీల్, జయరామ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించి కొంతమేర చిత్రీకరణ పూర్తయ్యింది. కాగా, చరణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని మార్చి 27న తన పాత్ర తాలూకు ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేయడానికి టీమ్ ప్లాన్ చేస్తోందట. ఇందులో నెవర్ సీన్ బిఫోర్ లుక్ లో మెస్మరైజ్ చేయబోతున్నాడట `చిరుత` స్టార్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
Also Read: యాక్షన్ తో మొదలుపెట్టనున్న బాలయ్య!?
యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. 2023 సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేయనుందని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



