Home

»

Latest News

`దేవి`, `కుమారి` బాట‌లో `స‌ఖి` వెళుతుందా!?

Jan 27, 2022 11:07AM

ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ తో సంగీత ద‌ర్శ‌కుడిగా ప్ర‌యాణం మొద‌లుపెట్టి.. ఆపై స్టార్ కంపోజ‌ర్ గా రాణించిన వైనం రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ సొంతం. 1999లో విడుద‌లైన `దేవి` చిత్రంతో తెలుగునాట‌ స్వ‌ర‌విన్యాసాల‌కు శ్రీ‌కారం చుట్టిన దేవి శ్రీ‌.. ఆపై అన‌తికాలంలోనే అగ్ర సంగీత ద‌ర్శ‌కుడ‌య్యారు. అయితే, ఈ ప్ర‌యాణంలో త‌నకు తొలి విజ‌యాన్నిచ్చిన‌ నాయికా ప్రాధాన్య సినిమాల జాన‌ర్స్ కంటే ఎక్కువ‌గా ప్రేమ‌క‌థా చిత్రాల‌కు, మాస్ ఎంట‌ర్టైన‌ర్స్ కి మాత్ర‌మే ప‌నిచేస్తూ వ‌స్తున్నారు డీఎస్పీ.

కాగా, టాలీవుడ్ లో దేవి శ్రీ ప్ర‌సాద్ ఫిల్మోగ్ర‌ఫీని ప‌రిశీలిస్తే.. త‌న ఖాతాలోని విమెన్ ఓరియెంటెడ్ మూవీస్ ని వేళ్ళ మీద లెక్క పెట్ట‌వ‌చ్చు. `దేవి`, `సై ఆట‌`, `కుమారి 21 ఎఫ్`.. ఇలా ఇప్ప‌టివ‌ర‌కు మూడు నాయికా ప్రాధాన్య చిత్రాల‌తో ప‌ల‌క‌రించారు డీఎస్పీ. వీటిలో `దేవి`, `కుమారి 21 ఎఫ్` మంచి విజ‌యం సాధించాయి. క‌ట్ చేస్తే.. స్వ‌ల్ప విరామం అనంత‌రం రాక్ స్టార్ నుంచి మ‌రో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ రాబోతోంది. ఆ సినిమానే.. `గుడ్ ల‌క్ స‌ఖి`. కేర‌ళ‌కుట్టి కీర్తి సురేశ్ టైటిల్ రోల్ లో న‌టించిన ఈ స్పోర్ట్స్ డ్రామా రేపు (జ‌న‌వ‌రి 28) థియేట‌ర్స్ లోకి వ‌స్తోంది. మ‌రి.. స్వ‌ల్ప విరామం అనంత‌రం దేవి శ్రీ ప్ర‌సాద్ స్వ‌ర‌కల్ప‌న‌లో వ‌స్తున్న ఈ ఫిమెల్ సెంట్రిక్ ఫిల్మ్.. `దేవి`, `కుమారి 21 ఎఫ్` త‌ర‌హాలో విజ‌యం సాధిస్తుందేమో చూడాలి.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com